NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్.. షూటింగ్ దాదాపు క్లైమాక్స్ లో ఉంది. ఈ సినిమా తర్వాత వెంటనే.. ఎన్టీఆర్ తన కెరియర్ లో 30 వ సినిమా స్టార్ట్ చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది.
రాజమౌళి తో చేసిన తర్వాత ఎన్టీఆర్ చేసిన చాలా సినిమాలు ప్లాప్ అవడంతో.. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు.. గతంలో ఎదురైనా ఫలితాలు ఈసారి ఎదురు కాకూడదని పైగా 30 చిత్రం కావడంతో… ఈ భారం మొత్తం కొరటాల కి ఎన్టీఆర్ అప్పగించడం జరిగింది అట. వాస్తవానికి ఎన్టీఆర్ 30 చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వం లో.. తెరకెక్కల్సి ఉంది. అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల.. సినిమా క్యాన్సిల్ అవ్వడం జరిగింది.
Read more: NTR: ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో స్టార్ట్ అయ్యే తేదీ డీటెయిల్స్..??
ఇటువంటి తరుణంలో.. ఈ సినిమాలో కీలకమైన నటీనటులను డైరెక్టర్ కొరటాల తీసుకుంటున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అదే రీతిలో సంపత్.. బొమ్మని రాని వంటి పెద్దపెద్ద నటులను.. తాజాగా కొరటాల సెలెక్ట్ చేసినట్టు సమాచారం. వీళ్లంతా కీలక క్యారెక్టర్లు చేయనున్నట్లు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అంతే కాకుండా ఈ సినిమా అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని.. కొరటాల ఆల్రెడీ షెడ్యూల్స్ వేయటం జరిగిందట. ప్రస్తుతం కొరటాల.. చిరంజీవి హీరోగా “ఆచార్య” షూటింగ్ కి ముగింపు పలికే రీతిలో షూటింగ్ శరవేగంగా జరుపుతున్నరు. షూటింగ్ అయిన వెంటనే.. ఎన్టీఆర్ సినిమా.. స్టార్ట్ కానుందట. కరోనా నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు అనేక అవాంతరాలు ఎదురుకావడంతో.. గ్యాప్ రావటంతో ఎన్టీఆర్ కొరటాల ఈసినిమాని అతి తక్కువ ఈ టైంలో షూటింగ్ కంప్లీట్ అయ్యేలా.. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.