NTR: ఒకానొక టైంలో మెగా అభిమానులు వర్సెస్ నందమూరి అభిమానులు అనే వాతావరణం ఇండస్ట్రీలో భారీగా ఉండేది. తమ అభిమాన హీరో ఎవరిది రిలీజ్ అయినా గాని ఇద్దరు హీరోల అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. ముఖ్యంగా బాలకృష్ణ చిరంజీవి టైం లో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య టాగ్ అఫ్ వార్ అనే రీతిలో పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా స్టార్ట్ అయిందో.. అప్పటి నుండి.. నందమూరి ఇ అభిమానుల మధ్య మంచి వాతావరణం క్రియేట్ అయింది.
ఎన్టీఆర్, చరణ్ కలిసి.. నటిస్తూ ఉండటంతో సినిమాకి సంబంధించి ఎటువంటి టీజర్ లేదా ఫోటో.. రిలీజ్ అయిన ఇద్దరు హీరోల అభిమానులు భారీ ఎత్తున రికార్డులు సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యేలా కలసి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్.. “ఎవరు మీలో కోటీశ్వరుడు” అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ షో స్టార్ట్ కానున్న నేపథ్యంలో నందమూరి.. మెగా హీరోలకు సరికొత్త సర్ ప్రైజ్.. వీడియో జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ టాక్.
విషయంలోకి వెళితే.. షో కి సంబంధించి చరణ్ గేస్ట్ గా రానున్నట్లు.. దీంతో ఆ ప్రోమో త్వరలో రిలీజ్ చేసి..ఫ్యాన్స్ నీ అలరించినున్నట్లు సమాచారం. ఇప్పటికే RRR సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అదే రీతిలో రామ్ చరణ్ అనేక వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వాటికి మంచి ఆదరణ సోషల్ మీడియాలో లభిస్తోంది. ఈనేపథ్యంలో “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో నిర్వాహకులు చరణ్.. ఎన్టీఆర్ లకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసి షోపై టెలివిజన్ ఆడియన్స్ కి ట్రస్ట్ పెంచడానికి ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ టాక్.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!