యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదటి నుండి మాస్ సినిమాలతోనే సూపర్ డూపర్ హిట్లు సాధించింది. పాతికేళ్ల ప్రాయంలోనే ఆది, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. అలాంటి యంగ్ టైగర్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్న విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ హీరో వరస హిట్స్ మీద మంచి ఊపు మీదున్నాడు. అయితే 2018లో అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకూ సినిమా లేదు. ఆర్ ఆర్ ఆర్ కోసం తన పూర్తి సమయాన్ని వెచ్చించాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే.
2021 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు కరోనా కారణంగా ఆలస్యమైంది. అయితే త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలుకాబోతున్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ జిమ్ కు వెళ్లి బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమౌళి తిరిగి షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్ నుండి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
2021 సెకండ్ హాఫ్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కావొచ్చు. ఇక తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. కెజిఎఫ్ తో యావత్ దేశం దృష్టిని ఆకర్షించాడు. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించనున్నారు. ఈ చిత్రం అవుట్ లైన్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాఫియా డాన్ పాత్రను పోషించనున్నాడు. ప్రశాంత్ నీల్ వంటి మాస్ దర్శకుడి సినిమాలో మాఫియా డాన్ పాత్ర ఎన్టీఆర్ చేస్తున్నాడంటే ఇక ఫ్యాన్స్ కు అంతకుమించి ఏం కావాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?