NTR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ నటిస్తున్న “RRR” షూటింగ్ చాలా వరకు క్లైమాక్స్‌కి చేరుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ ఒక్క భారతదేశంలో మాత్రమే కాక ఇతర దేశాలలో కూడా రిలీజ్ అవుతుంది. బాహుబలి సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి కి మంచి గుర్తింపు లభించడంతో…RRR ప్రపంచంలో పేరుగాంచిన భాషలలో రిలీజ్ కానుందట.
ఇదిలా ఉంటే ఈ సినిమా మా షూటింగ్ స్టార్ట్ అయిన సమయంలో ఎన్టీఆర్ కి జోడీగా హీరోయిన్ దొరకలేదు అన్న సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని నెలల పాటు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ఎవరు నటిస్తారు అన్నది ఎవరికి అర్థం కాలేదు. బ్రిటిష్ అమ్మాయి లుక్ ఉండేలా.. ఆ పాత్ర ఉండటంతో ఇతర దేశాలకు చెందిన ఒక అమ్మాయి మొదటి లో అనుకున్న కానీ ఆమె మధ్యలో డ్రాప్ అవడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఒలివియా మోరీస్ కన్ఫామ్ కావటంతో.. ఆమె ఎన్టీఆర్ సరసన నటిస్తోంది.
Read more: NTR: ఎన్టీఆర్ 30వ సినిమా కోసం స్టార్ నటీనటులను రంగంలోకి దింపుతున్న కొరటాల శివ..??
అయితే సినిమా మొత్తానికి వీరిద్దరికీ సంబంధించిన సన్నివేశాలు బ్యాలెన్సింగ్ ఉండటంతో పాటు వీరిద్దరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడానికి సినిమా యూనిట్ రెడీ అయిందట. అయితే ఈ సాంగ్ రొమాంటిక్ తరహాలో.. చాలా అందమైన ప్రదేశాల మధ్య.. ఉక్రెయిన్ ప్రాంతంలో చిత్రీకరించనున్నారట. ఇందుకోసం హీరో హీరోయిన్లు ఇద్దరూ ఇప్పుడు ఉక్రెయిన్ కి బయలుదేరనునట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ చాలా ఆలస్యం కావడంతో బ్యాలెన్సింగ్ షూటింగ్ .. చాలా వేగంగా పూర్తిచేయాలని రాజమౌళి డిసైడ్ అవ్వడం జరిగిందట. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో..RRR.. త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. అక్టోబర్ 13 వ తారీకు దసరా సందర్భంగా సినిమా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది.