Date of Birth: డబ్బు ఎవరికి చేదు చెప్పండి! దాదాపుగా అందరూ ఎదోఒకనాడు ఖచ్చితంగా జీవితంలో మునుపెన్నడూ లేని డబ్బుని సంపాదించుకోవాలి అని అనుకున్నవారే. అయితే ఆ అదృష్టం ఏ కొద్ది మందికో దక్కుతుంది. దీనికి కారణాలు అనేకం, ఇకపోతే సంఖ్యాశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే.. సంఖ్యాశాస్త్రం (Numerology) ఆధారంగా మీ గతిని చెప్పొచ్చని అంటున్నారు. ఇక మరెందుకాలస్యం.. రానున్న కొత్త ఏడాదిలో మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయో లేదా అనే విషయాలను మీ పుట్టిన తేదీను బట్టి తెలుసుకోండి మరి!
ఇక్కడ మీరు ఈరోజు పుట్టారో తెలుసుకోండి!
మొదటగా 1, 10, 19, 28 వ తేదీలలో పుట్టిన వారి సంగతి చూద్దాం. ఈ సంవత్సరం వీరికి ఫ్యాషన్ రంగానికి సంబంధించిన బిజినెస్ అనుకూలంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అలాగే వీరికి హై బీపీ & కంటి తదితర సమస్యలు వచ్చే సూచనలు వున్నాయట. అలాగే 2, 11, 20, 29 వ తేదీలలో పుట్టిన వారిని మనం చూసినట్టైతే.. వీరు సంపాదన కొరకు అధికంగా హార్డ్ వర్క్ చేయవలసి వుంటుందట. ఇక 3, 12, 21, 30వ తేదీలలో పుట్టిన వారికి తమ పనిలోనే అదృష్టం వరిస్తుందట. సో వీరికి పనే దేవుడన్నమాట. 4, 13, 22, 31 వ తేదీలలో మీరు పుట్టినట్లైతే, మీరు బుధ, శుక్రవారాలు ఏ పని తలపెట్టినా జరుగుతుందట!
ఇక మిగిలిన వారి సంగతి కూడా చుడండి!
మీరు 5, 14, 23 వ తేదీలలో పుట్టిన వారైతే, కొత్త భాగస్వామ్యాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇక 6, 15, 24 వ తేదీలలో పుట్టిన వారి సంపాదన కంటే ఖర్చే అధికంగా ఉంటుందంట! 7,16,25 వ తేదీలలో పుట్టిన వారికి రీసెర్చ్ బేస్డ్ కెరీర్ లో మంచి పురోగతి వుంటుందట. 8,17, 26 వ తేదీలలో పుట్టిన వారు పొదుపులను బాగా సేకరించగలుగుతారు. ఇక చివరగా 9, 18, 27 వ తేదీలలో పుట్టిన వారి గురించి మనం చూసుకున్నట్టయితే.. పెట్టుబడులకు ఇది మంచి తరుణమట. వాటి నుండి వీరు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు.