NewsOrbit
న్యూస్

నిజామా …సీతాఫలం తింటే అలావుతుందా!

నిజామా ...సీతాఫలం తింటే అలావుతుందా!

ఇమ్యూనిటీ ఎక్కువగా  ఉంటే కొవిడ్-19 వైరస్ దరిచేరదు అన్న సంగతి అందరికి తెలిసిందే .  ఈ  విషయం తెలిసాక  అనేక రకాలుగా ఇమ్యూనిటీ ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టాము. సీతాఫలం లో కూడా మంచి ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉంది.

నిజామా ...సీతాఫలం తింటే అలావుతుందా!

ఏ కాలం లో వచ్చే పండ్లూ కూరగాయల్ని ఆ కాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. సమతులాహారానికి ఉదాహరణగా ఈ పండుని చెబుతారు. ఇందులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయి.

సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుంది. బౌల్ మూమెంట్‌కి సహకరిస్తుంది. తద్వారా, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దూరమౌతాయి. అంతే, కాకుండా డయేరియా లాంటి ప్రాబ్లంస్ కి కూడా ఈ పండు చెక్ పెడుతుంది.సీతాఫలంలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిస్న్ వయసు మీద పడకుండా చేస్తాయి.

ఈ పండులో ఉండే యాంటీ-ఏజీయింగ్ ప్రాపర్టీస్ వలన స్కిన్ మంచి గ్లో తో ఉంటుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. అందుకే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత / ఎనీమియా దరి చేరదు. హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి.

చాలా రకాల పండ్ల లాగానే సీతా ఫలం లో కూడా శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి.బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. ఈ పండ్లలోని విటమిన్ A… మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. ఇందులోని విటమిన్ B6… ఆస్తమాకి చెక్ పెడుతుంది. అయితే ఆస్తమా ఉన్నవారు డాక్టర్ సలహా తో మాత్రమే దీన్ని  తీసుకోవాలి.

విటమిన్‌ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. వెంట్రుకలు గట్టిగా ఉండటానికి… చుండ్రును దూరం చేసుకోవడానికి… వెంట్రుకలు నల్లగా ఉండటానికి కూడా సీతాఫలం సహకరిస్తుంది. గర్భిణీలు ఈ పండును తీసుకుంటే వాళ్లకు ఎన్నో లాభాలుఉన్నప్పటికీ పరిమితం  గానే  తినాలి. గర్భంలోని శిశువు జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. డెలివరీ తర్వాత తల్లులకు తొందరగా పాలు రావాలంటే ఈ పండు తీసుకుంటే మంచిది.

మధుమేహ వ్యాధి గ్రస్తులు, వూబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాతో తీసుకోవాలి.సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. పిసిఒడి ఉన్న మహిళలకుకూడా సీతాఫలం చాల మంచిది.ఎందుకంటే వారికీ ఐరన్ చాలా అవసరం. అందుకు మంచి మూలం సీతాఫాలం , పిసిఓడి ఉన్న మహిళలు సీతాఫలం తినవచ్చని పోషకాహార నిపులు చెబుతున్నారు. ఇది సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గిస్తుంది మరియు చిరాకును తగ్గిస్తుంది. సీతాఫలంను తినడం లో ఏదైనా సందేహం ఉంటె డాక్టర్ నికలిసి సలహా తీసుకోండి.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju