Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతిని విక్కీ కోప్పడతాడు. విక్కీ పద్మావతి ల గొడవని చూసిన కృష్ణ అరవిందను తీసుకువస్తాడు. విక్కీ డబ్బులు ఇవ్వట్లేదని కృష్ణ ఒక కొత్త ప్లాన్ వేసి అరవిందతో విక్కీని తిట్టించాలి అనుకుంటాడు కానీ కృష్ణ ప్లాన్ అరవింద తిప్పి కొడుతుంది. మరో కొత్త ప్లాన్ తో కృష్ణ రెడీ అవుతాడు.

ఈరోజు 378 ఎపిసోడ్ లో విక్కీ పద్మావతి గొడవ పడుతుంటే అరవింద ని తీసుకువచ్చిన కృష్ణ, వాళ్ల మధ్య సఖ్యత లేదు అని అరవింద్ కు చెప్పాలి అని అనుకుంటాడు. కానీ విక్కీమేము బాగానే ఉన్నాము, నేను పద్మావతి మీద గట్టిగా అరిచేటప్పటికీ బావ మేము గొడవ పడుతున్నాం అని అనుకున్నాడు అక్క అంతే పద్మావతి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల నేను గట్టిగా అరవాల్సి వచ్చింది అంతేకానీ మా మధ్య ఏ గొడవలు లేవు నువ్వు దీని గురించి ఆలోచించొద్దు అని అంటాడు. బావా నువ్వు మా మీద కాదు శ్రద్ధ పెట్టాల్సింది అక్క మీద పెట్టు అని అంటాడు. సరే మీరిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి రేపు శ్రీమంతానికి ఇద్దరు కలిసి గ్రాండ్గా చేయండి అని అంటుంది అరవింద. నా ప్రాణమే నువ్వు అక్క అలాంటిది నీ శ్రీమంత అని నేను ఎలా చేస్తాను చూస్తావు కదా అని అంటాడు విక్కీ. పద్మావతి కూడా అవును అరవింద్ గారుశ్రీమంతం చాలా గ్రాండ్ గా చేస్తాము అని అంటుంది.

కుచల అత్తగారి పెత్తనం..
కుచల ఉదయం వాకింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. పక్కనే పద్మావతి బండి కడుగుతూ ఉంటుంది. గరుడ(బండి ) ఏందమ్మి పద్మావతి ఆవిడ మూర్తి వచ్చి పడిపోయేలా ఉంది ఒకసారి చూడు అని అంటాడు. పద్మావతి కుచలని చూసి అది మూర్చ కాదు గరుడ ఆమె డాన్స్ వేస్తుంది పాటలు వింటూ అని అంటుంది. అవునా నేనే ఆమెను చూసి భయపడ్డాను అని అంటాడు గరుడ. అప్పుడే కుచల అనుని పిలుస్తుంది. ఏంటి అత్తయ్య అంటుంది అను. ఎప్పుడు ఏడుపుగొట్టేసుకుని ఆ ముఖం ఏంటి, ఓయ్ జ్యూస్ తీసుకొని రా పో అని అంటుంది. ఇదంతా పద్మావతి చూస్తూ ఉంటుంది. గరుడ బంగారం లాంటి భర్తని ఇచ్చాడు అనుకి కానీ గయ్యా లాంటి అత్తగారిని కూడా ఇచ్చాడు అని పద్మావతి తో అంటాడు. అవును గరుడ ఈవిడకి ఎప్పుడు మా అక్కని ఏదో ఒకటి అనే పనిలోనే ఉంటుంది ఒకసారి వీడికి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది పద్మావతి. అవునా అమ్మి నువ్వు అన్నదే కరెక్టు ఈవిడికి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్తేనే దారిలోకి వస్తుంది మా నాన్నమ్మని ఏమీ అనకుండా ఉంటుంది అని అంటాడు గరుడ. జ్యూస్ తీసుకొని వచ్చిన తర్వాత అను కాకరకాయ జ్యూస్ ఇంత చేదుగా ఉంది ఏంటి అని మళ్ళీ అను మీద గొడవ పడుతుంది కుచల. వెళ్లి క్యారెట్ జ్యూస్ తీసుకొని రా పో అని అంటుంది.

కుచలని భయపెట్టిన పద్మావతి..
ఇక గుజరా తన మేకప్ సామాను ఏవో తెచ్చుకోవడానికి స్టోర్ రూమ్ లోకి వెళుతుంది. కుశల వెనకాలే పద్మావతి కూడా వెళ్లి కుచలని భయపెట్టాలి అనుకుంటుంది. పద్మావతి దయ్యం వేషం వేసుకొని, తెల్లని బట్టలతో ముఖానికి మాస్క్ వేసుకొని కుచలని భయపెట్టాలి అనుకుంటుంది. కుచల స్టోర్ రూమ్ లో, దయ్యాన్ని చూసి భయపడుతుంది. వెంటనే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. పద్మావతి కుచలకి మంచినీళ్లు ఇస్తుంది. దయ్యం విషయంలో ఉన్న పద్మావతిని చూసి కుశల మళ్లీ దడుచుకొని అక్కడినుండి బయటికి పారిపోయి వచ్చేస్తుంది. కుశల బయటికి రావడం అణు చూసి ఏమైందత్తయ్య అని అంటుంది. కుచల ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి భయంగా లోపలికి వెళ్ళిపోతుంది. వెనకాలే వచ్చిన పద్మావతిని చూసి అను అమ్మి నువ్వే కదా ఇదంతా చేసింది అని అంటుంది. పద్మావతి మాస్క్ తీసేసి నేనే అక్క అని అంటుంది. ఏంటమ్మా ఇలా చేయొచ్చా అని అంటుంది లేదంటే నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఆవిడ అంత మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను అక్క, ఆవిడకి బుద్ధి చెప్పాలనుకునే ఇలా చేశాను ఇప్పుడే కాదు ఆవిడ నిన్ను ఎప్పుడు బాధపెట్టిన ఇలానే చేస్తాను అని అంటుంది. తప్ప మీ అలా చేయకూడదు ఎంతైనా ఆవిడ మనకి అత్తగారు అని అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను అక్క అని అంటుంది పద్మావతి.

కుచలని కోప్పడిన నారాయణ..
నారాయణ అరవింద శాంతాదేవి అందరూ హాల్లో కూర్చుని ఉండగా గాజులు తీసుకొని సేటు వస్తాడు. ఇప్పుడు ఎందుకు గాజులవాన్ని పిలిచారు అని అంటుంది కుచల. నీకోసం కాదులే అంటాడు నారాయణ. అప్పుడే అక్కడికి అను పద్మావతి ఇద్దరు వచ్చి శ్రీమంతానికి అన్ని పనులు అయిపోయాయి, రేపు కావాల్సినవన్నీ సర్దేశాము అని అంటారు వెంటనే శాంతాదేవి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటుంది. ఏముంది ఇందులో సంతోషపడ్డానికి వాళ్ళు చేయాల్సిన పని చేశారు అని అంటుంది కుచల నువ్వు చేయాల్సిన పని చేశారు ముందు అది తెలుసుకో అంటాడు నారాయణ. ఇంతకీ ఈ గాజుల వాళ్ళని ఎందుకు పిలిచామంటే మన ఇంటి కోడలు అయినా పద్మావతి అను కి ఇద్దరికీ గాజులు వేయడం కోసం పిలిచాము అని అంటాడు. సరే అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు వాళ్లకు గాజులు వేయండి అని చెప్తాడు నారాయణ. సరే అని గాజులు తీసుకొని పద్మావతి వాళ్లకి తొడుగుదాం అనుకునే సమయానికి, విక్కీ, ఆర్య ఇద్దరు వస్తారు. కృష్ణ కూడా అప్పుడే కిందకి వచ్చి అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. వీళ్ళ సంతోషాన్ని నేను దూరం చేస్తాను కదా అని అనుకుంటాడు. శ్రీమంతం అని తెగ సంబరపడిపోతున్నారు, దాన్ని ఎలా ఆపాలో నాకు తెలుసు అని అంటాడు. కుశల అల్లుడుగారు రేపు శ్రీమంతం ఉంది మీరు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది కృష్ణతో అరవింద్ అంటే నాకు ప్రాణం కదా అత్తయ్య నేను ఎలా వెళ్తాను అని అంటాడు కృష్ణ.

పద్మావతి కి గాజులు తొడిగిన విక్కీ..
ఇక కృష్ణ అలా మాట్లాడుతూ ఉంటే అది విని విక్కీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు.ఇక పద్మావతి మనసులో గాజులు విక్కీ నాకు తొడిగితే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ ఒక నిమిషం ఆగండి అని అంటాడు. విక్కీ ఆర్య ఇద్దరు ఆగుతారు. ఏంటి బాబాయ్ అని అంటాడు. ఏం లేదు విక్కీ మీరిద్దరూ ఉండంగా వీళ్ళు వేరే వాళ్ళ చేత గాజులు వేయించుకోవడం ఎందుకు, మీరే గాజులు తొడిగేస్తే పోలేదు అని అంటాడు.వెంటనే పద్మావతి శ్రీనివాసా నువ్వు ఉన్నావయ్యా నా కోరిక అడిగి అడగముందే తీరుస్తావు అని అనుకుంటుంది. విక్కీ అవన్నీ ఎందుకులే బాబాయ్ నేను వెళ్తాను అని అంటాడు. ఆర్య మాత్రం చెప్పి చెప్పక ముందే అను పక్కన వచ్చి కూర్చుంటాడు. కుచల విక్కీ ని చూసి నేర్చుకో చెప్పంగల్ని అలాగా వచ్చి ఆడవాళ్ళ మధ్యలో కూర్చోవడం కాదులే అని అంటుంది ఆర్యా ని, నారాయణ ఏమి అవసరం లేదు నువ్వు కూర్చోడానికి నువ్వు కూడా రా వచ్చి పద్మావతి గాజులు వెయ్యి అని అంటారు. ఇక చేసేదేం లేక విక్కీ కూడా వచ్చి పద్మావతి గాజులు తోడుకుదాం అనుకునే టయానికి, అరవింద నాకు ఒక ఐడియా వచ్చింది వీళ్ళిద్దరి కళ్ళకి గంటలు కట్టండి వీళ్ళ భార్యల మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో మనకి ఇప్పుడు తెలిసిపోతుంది అని అంటుంది. అదిలాగమ్మా అంటాడు నారాయణ అవును బాబాయి ఇప్పుడు వీళ్ళ కళ్ళ గంతులు కట్టండి గాజుల్లో నుంచి వాళ్ళ భార్య చేతి గాజుల సైజు తీసుకొని వీళ్ళువాళ్లకి తొడుగుతారు అప్పుడు వాళ్ళ మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది అని అంటుంది. అవన్నీ ఇప్పుడేం వద్దులే అక్క అని అంటాడు విక్కీ కాదు అవ్వాల్సిందే అని అంటుంది. ఇక కృష్ణ ఇద్దరు కళ్ళకి గంతులు కడతాడు. కృష్ణ చాలా సంతోషంగా ఉంటున్నారు కదా మీ సంతోషం ఎక్కువ రోజులు ఉంచను అని అనుకుంటాడు. అరవింద కోసం విక్కీ పద్మావతికి గాజులు తొడుగుతాడు పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆర్య కూడా అనుకి గాజులు తొడుగుతాడు.

రేపటి ఎపిసోడ్ లో నీకోసం గాజులు తొడిగిన మా విక్కీకి నువ్వు గిఫ్ట్ గా ఒక పాట పాడు అని అంటుంది అరవింద పద్మావతి తో సరే అని పద్మావతి మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది అనే పాటను పాడుతుంది విక్కీ కోపంగా అట్లానే ఉంటాడు పద్మావతి డాన్స్ చేస్తూ పాట పాడుతుంది.