Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్ లో మంచి TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తున్న సీరియల్ ‘నువ్వు నేను ప్రేమ’ ప్రతీ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ నేటితో 312 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో అను కి చీర నచ్చకపోవడానికి, ఆర్య నే కారణమని పద్మావతి చెప్పడంతో, అందరూ నవ్వుకుంటారు. ఇక పద్మావతి నేను ఒక చీర సెలెక్ట్ చేస్తాను ఇది బావగారికి కచ్చితంగా నచ్చుతుంది అని, ఒక చీరను సెలెక్ట్ చేస్తుంది అది అందరికీ నచ్చుతుంది. అరవింద విక్కీని సూట్ తీసుకోవడానికి వెళ్దాం అంటుంది, అరవింద విక్కీ పద్మావతి సూట్ సెలెక్ట్ చేయడానికి వెళ్తారు. ఒక మంచి సూట్ ను అరవింద విక్కీ కోసం తీసుకుంటుంది. ట్రైల్ చేయడానికి రూమ్ కి వెళ్ళమంటుంది అరవింద.

అప్పుడే అక్కడికి అరవింద భర్త కృష్ణ వస్తాడు, వస్తూనే ఆగిపోయే పెళ్ళికి అందరూ బట్టలు కొనడానికి వచ్చారా అని మనసులో అనుకుంటుండగా, విక్కీ కృష్ణ ని చూసి, ఏంటి బావ ఇంత లేట్ అయింది అని అడుగుతాడు. కృష్ణ కోర్టులో పని ఉంది అని చెప్తాడు. సరే బావా మా సెలెక్షన్ అంతా అయిపోయింది మీకు అక్క సెలెక్ట్ చేసింది, నచ్చిందో లేదో వెళ్లి చూసుకోండి అంటాడు.ఇక కృష్ణ మనసులో పద్మావతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అది నేను ఉండగా జరగనివ్వను అని అనుకుంటాడు. విక్కీ ట్రైల్ రూమ్ కి వెళ్తాడు. కృష్ణ అరవింద దగ్గరకు వచ్చి రానమ్మ పెళ్లి షాపింగ్ అంతా అయిపోయిందా అంటాడు. పద్మావతిని చూసి ఏంటి పద్మావతి మీ అక్క పెళ్లికి బట్టలు తీసుకోవడం అయిపోయిందా, మరి నాకు బట్టలు తీసుకున్నావా అంటాడు. అరవింద తనని ఎందుకు అలా అడుగుతున్నారు అంటుంది. మీ ఇంట్లో ఎవరికీ ఏం నచ్చుతుందో పద్మావతికే కదా తెలుసు నా గురించి అంతా తెలిసినప్పుడు, నాకు బట్టలు సెలక్షన్ కూడా తనకు తెలుస్తుంది,కదా అని అన్నాను అంటాడు.అరవింద లేదండి మీకు నేను సెలెక్ట్ చేశాను ఒకసారి చూసి రండి అంటుంది. నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత అది కచ్చితంగా నాకు నచ్చుతుంది రానమ్మ అని కృష్ణ అంటాడు.

అరవింద పద్మావతి కొత్త డ్రెస్ తీసుకోమని అడుగుతుంది, కృష్ణ కూడ పద్మావతి ని కొత్త డ్రెస్ తీసుకోమంటాడు. పద్మావతి ఒక డ్రెస్ తీసుకొని ట్రైలర్ రూమ్ కి వెళుతుంది. పద్మావతి కూడా విక్కీ ఉన్న ట్రయల్ రూమ్ కి వెళ్లడం కృష్ణ చూస్తాడు. ఇప్పుడు నేను పద్మావతిని ఆపితే ఇక్కడ గొడవ జరుగుతుంది అరవిందకు, అంతా తెలిసిపోతుంది,అని ఎలా ఆపాలి పద్మావతిని, అ రూమ్ కి వెళ్లకుండా అని అనుకుంటాడు.
ట్రైల్ రూమ్ లో విక్కిని చూసి పద్మావతి గట్టిగా అరుస్తుంది. విక్కీ డోర్ కొట్టి లోపలికి రావాలని తెలియదా అంటాడు, ఇదేమైనా ఆఫీస్ అనుకున్నారా డోర్ కొట్టు లోపలికి రావడానికి అని పద్మావతి అంటుంది. సరే నేను ముందు వచ్చాను కాబట్టి నేనే ముందు ట్రై చేస్తాను నువ్వు బయటికి వెళ్ళు అంటాడు. పద్మావతి బయటకు వెళ్లడానికి డోర్ తీయాలనుకుంటుంది డోర్ రాదు. ఇదేంటి డోర్ రావట్లేదు అని పద్మావతి అంటుంది. విక్కీ నువ్వే గట్టిగా వేసావు కదా తియ్యి అంటాడు. ఇద్దరు ఎంత ట్రై చేసినా డోర్ రాదు. అప్పుడే పద్మావతి బల్లిని చూసి గట్టిగా అరిచి, విక్కీని కౌగిలించుకుంటుంది. బయట నుంచి పద్మావతి ఇంకా రాలేదేంటి అని కృష్ణ అనుకుంటూ ఉంటాడు. పద్మావతి ని విక్కీ శివంగిణి అంటావు బల్లిని చూసి భయపడ్డావేంటి అంటాడు. పద్మావతి నాకేం భయం ఉంటే భయం లేదు అని మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్తుంది, మరోసారి బల్లిని చూసి గట్టిగా అరిచి విక్కీని కౌగిలించుకుంటుంది. విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే కృష్ణ ఒక మెకానిక్ ని తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేయిస్తాడు. డోర్ ఓపెన్ అయ్యే టయానికి ఇద్దరు కౌగిలించుకొని కృష్ణ కంట పడతారు. ఆ సీన్ చూసి కృష్ణ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పద్దు,విక్కి ఇద్దరు బయటికి వచ్చి డోర్ లాక్ అయింది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. విక్కి వెళ్లిన తర్వాత, పద్మావతిని కృష్ణ చేయి పట్టుకొని పక్కకు తీసుకొచ్చి పద్మావతి తో గొడవ పడతాడు.

పద్మావతి నీకే ఎన్నిసార్లు చెప్పాను విక్కీతో రాసుకొని తిరగద్దని అయినా నీకు లెక్కలేదు ఇప్పుడు ఏకంగా,రూమ్ లోనే ఇద్దరు కౌగిలించుకొని.. నేను భరిస్తున్నాను కదా అని ఇలా చేస్తే నేను ఊరుకోను పద్మావతి అని వారిని ఇస్తాడు. పద్మావతి ఊరుకోక ఏం చేస్తావ్, ఏం చేస్తావు అని గట్టిగా అడుగుతుంది. అయినా నన్ను ఇలా ప్రశ్నించడానికి నువ్వు ఎవరు ఇలా నా చేయి పట్టుకుని లాగే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అంటుంది. కృష్ణ నేను నీకు కాబోయే భర్తని అనగా, పద్దు ఇంకొకసారి ఆ మాట అన్నావో పళ్ళు రాలుతాయి అంటుంది. నువ్వు ఎంత గింజుకున్నా చివరికి నీ మెడలో తాళి కట్టేది నేనే, నా గురించి నీకు తెలుసు కదా పద్మావతి అని అంటాడు. పద్మావతి మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు, అంతదాకా వస్తే నేను చావడానికి నిన్ను చంపడానికైనా రెడీ అని కృష్ణకు వారిని ఇస్తుంది. ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకుంటే, నీకే మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. కృష్ణ మనసులో విక్కీ ఉన్నాడని కదా నీ ధైర్యం చూస్తాను నీ అంత చూస్తాను అని అనుకుంటాడు.
పద్మావతి, అను లు తెచ్చిన బట్టలన్నీ చూసుకుంటూ ఉండగా పద్మావతి అనుతో అక్క బావ గారు,నువ్వు ఫస్ట్ ఎక్కడ కలిశారు,ఎప్పుడు ప్రేమించుకున్నారు, అని అడుగుతుంది. అను నేను మీ బావగారుసంవత్సరం క్రితం, ఒక నీళ్ళకొలను దగ్గర కలిసాము అని చెప్తుంది. సంవత్సరమైందంటే మీ ఇద్దరికీ ఒకరికొకరు ఇష్టాలని తెలుసు కదా అక్క అని అడుగుతుంది పద్మావతి. అవును అంటుంది అను. మరి రేపు విషయం బావగారికి ఎందుకు గుర్తులేదు అని అడుగుతుంది, రేపు ఏంటమ్మి నాకు గుర్తులేదు అంటుంది అను, నీకే గుర్తు లేకపోతే బావ గారికి ఎలా గుర్తుంటుంది అక్క అంటుంది పద్మావతి..
రేపటి ఎపిసోడ్ లో ఆర్య విక్కీని పద్దు వాళ్ళ ఇంటికి తోడు రమ్మని అడుగుతాడు. విక్కీ సరే అని వెళ్లడానికి రెడీ అవ్వగా,సిద్దు నేను కూడా వస్తాను అంటాడు. నువ్వెందుకు అక్కడికి నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు అంటాడు విక్కీ. నేను నా రోజ్,కోసం వస్తాను అని చెప్తాడు సిద్దు. రోజు ఎవరు అని ఆర్యా అడగ్గా, సిద్దు పద్మావతి కోసమే అని చెప్తాడు. చూడాలి మరి సిద్దు నీ విక్కీ ఏలా ఆపుతాడో , లేదంటే తను పద్మావతిని ప్రేమిస్తున్న విషయం చెప్తాడో తెలియాలంటే రేపటి దాకా ఆడాల్సిందే….