NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Nuvvu Nenu Prema:విక్కీ మనసు మారడానికి భక్త ప్రయత్నం.. కుచల ఆపనుందా? అను ఆర్యాలకు కుచల వార్నింగ్..

Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights

Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి వికీల మధ్య గొడవ జరుగుతూ ఉంటే, అక్కడికి కృష్ణ పద్మావతి తల్లిదండ్రులను తీసుకెళ్లి, వాళ్ల గొడవను చూపిస్తాడు. విక్కీ పద్మావతి మధ్య సఖ్యత లేదని తెలిసి వాళ్ళు ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నారని తెలిసి భక్త పార్వతీ బాధపడతారు. దీనంతటికీ కారణం ఎవరని పద్మావతిని కుటుంబ సభ్యులు నిలదీస్తారు. దీంతో పద్మావతి నిజం చెప్పక తప్పదు అనుకోని, విక్కీ పద్మావతి ల మధ్య జరిగిన విషయాలన్నిటికీ కారణం కృష్ణయ్య అని చెప్తుంది. ఆవేశంతో భక్తా కృష్ణని చంపడానికి బయలుదేరుతాడు. అరవింద గారి కోసం మనం కృష్ణుని ఏమీ చేయకూడదని, విక్కీ మనసు మార్చుకోవడం తప్ప ఇంకొక, ఆలోచన చేయొద్దని పద్మావతి తల్లిదండ్రులకు చెప్తుంది.

Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights

Krishna Mukunda Murari: ముకుందా మురారిలా పెళ్లి కార్డు కృష్ణకిచ్చిన భవాని.. మురారి పెళ్ళి ఆపెస్తాడా.?

ఈరోజు ఎపిసోడ్ లో, పద్మావతి పార్వతీ వాళ్ళకి నచ్చచెప్పి, నేను విక్కీ కచ్చితంగా కలుస్తాను ఆయన మనసు నేను మారుస్తాను ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమని బయటికి తీయడం, నేను ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఆ ప్రయత్నానికి మీరు నాకు సహకరించండి అంతేగాని మీరు, నా నీచున్ని ఏదైనా చేద్దామనుకుంటే అందరం బాధపడాల్సి వస్తుంది అని అంటుంది. పద్మావతి రూమ్ లోకి వెళుతుంది. అప్పటికే విక్కీ పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ ఫోన్ చేయడం పద్మావతి మాట్లాడటం, అంతకుముందు పెళ్లిలో కూడా పద్మావతి అరవింద గారిని వదిలే అని చెప్పడం. అవన్నీ తలుచుకొని విక్కీకి చాలా కోపం వస్తుంది. అప్పుడే అక్కడికి పద్మావతి రావడంతో పద్మావతిని కోపంగా చూసి పడుకుంటాడు. పద్మావతి నేను మా అమ్మ వాళ్ళతో ఈయన మారతాడు అని చెప్పాను కానీ ఈయన మనసు మారేలా లేదు ఈయన ఎప్పటికీ మారడేమో అని భయపడుతూ బాధపడుతూ, శ్రీనివాస నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని దేవుడికి దండం పెట్టుకొని, బాధపడుతూ పడుకుంటుంది. విక్కీ కూడా పద్మావతి ఎప్పటికీ మారదు నేను మారుతుందని అనుకున్నాను కానీ ఇంకా కృష్ణతో మాట్లాడుతూనే ఉంది. ఎప్పటికీ పద్మావతిని క్షమించకూడదు అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema:గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న పద్మావతి ఫ్యామిలీ..? పద్మావతి ఏం చేయనుంది? కుచలకి గుణపాఠం చెప్పిన ఆండలు..

Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights

అను భయం..ఆర్య ఓదార్పు..

ఇక అను కుచల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆర్య వస్తాడు. ఏంటి అను డల్లుగా ఉన్నావు అంటే ఏమి లేదు అని అంటుంది.నాకు వెళ్లి కాఫీ తీసుకొని రా అని అంటాడు. ఆ మాట అను వినిపించుకోదు, ఆలోచిస్తూ ఉంటుంది కుచల గురించి, ఏమైంది అను ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు ఆర్య. మీ అమ్మగారి గురించి మీకు తెలిసిందే కదండీ ఆవిడ చిన్న విషయాన్ని నీ గురించే పెద్ద గొడవ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు మనం దాచి పెట్టిన నిజం ఆవిడకు తెలిసిందనుకో ఇక ఏమైనా ఉందా చెప్పకుండా ఉందామా అంటే ఆవిడ ఎలాగైనా నిజం తెలుసుకుంటుంది నేను డల్లుగా ఉంటే కారణం ఏంటి అని అడిగితే నేను నిజం చెప్పకుండా ఎలా ఉంటాను నాకు చాలా భయంగా ఉంది ఏమంటుందో అని, ఏమీ కాదులే అను నువ్వు అమ్మ గురించి ఆలోచించడం మానేసేయి అని అంటాడు. ఎలా మానేస్తానండి ఆవిడ ఆవలిస్తే పేగులు లెక్కబెడుతుంది అలాంటిది మన గురించి తెలియదు అంటారా, ఎంతకాలం నిజం దాచిపెట్టిన ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా అప్పుడైనా మనం సమస్యను ఎదురు కొనక తప్పదు కదా అని అంటుంది. ఇదంతా అక్కడే ఉండి, కుచల వింటుంది. అప్పుడే అను కుచల ని చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆర్య కూడా వాళ్ళ అమ్మని చూసి భయపడతాడు. వెంటనే కుచల దగ్గరికి వచ్చి ఏంటి నా దగ్గర ఏదో దాచి పెడుతున్నట్టు ఉన్నారు. ఏదో నిజం ఎప్పటికైనా తెలియాలి అంటున్నారు ఏంటి ఆ నిజం అని గట్టిగా అడుగుతుంది. ఆర్య ఏం లేదమ్మా తన ఏదో అట్లా అంటూ ఉంటుంది అని అంటాడు ఏంటి పెళ్ళాన్ని వెనకేసుకు రావడమే కాకుండా తల్లికి అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నావా అని అంటుంది. అది కాదమ్మా అని ఆర్య చెప్పబోతుంటే నువ్వు కాసేపు అరవకుండా ఉండు అని, చూడు అను ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదంటే మాత్రం నేను కిందకి వెళ్లి ఈ విషయాన్ని పెద్దది చేస్తాను ఇంట్లో అందరినీ పిలిచి రచ్చ చేస్తాను అలా చేయమంటావా లేదా అని అంటుంది. ఆర్య ఎందుకమ్మా చిన్నదాని కూడా అంత గొడవ చేస్తావు ఇప్పుడేమైందని, నేను గొడవ చేస్తున్నానా, నిజం ఏంటో చెప్పమని అడుగుతున్నా ఆమాత్రం అత్తగారిగా అడిగే హక్కు నాకు లేదా అని అంటుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ ప్లాన్ సక్సెస్…? పద్మావతి విక్కి ల గురించి నిజం బయటపడనుందా? పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights

నిజం చెప్పిన ఆర్య.. వార్నింగ్ ఇచ్చిన కుచల..

ఇక చేసేదేం లేక ఆర్య వాళ్ళ అమ్మ దగ్గర నిజం చెప్తాడు. అను ప్రెగ్నెంట్ అవుతుంది అని అనుకున్నాను కానీ తనకి నెగటివ్ రిపోర్టు వచ్చింది అని, ఆ విషయం నీకు చెప్పాలంటే తను భయపడుతుంది అని అంటాడు వెంటనే కుచల. అనుకున్నాను ఈ దరిద్రం మొఖం వేసుకొని తిరుగుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో, జరిగిందేమోనని భయపడుతూనే ఉన్నాను అయినా, దీని గురించి మనకు తెలిసిందే కదా అని అనుని తిడుతూ ఉంటుంది వెంటనే ఆర్య అమ్మ మాకు పెళ్లయి పది సంవత్సరాలు అయినట్లు మాట్లాడుతున్నావ్ అని అంటాడు. అవన్నీ నాకు తెలియదు భార్య మీ ఇద్దరికీ త్వరలోనే పిల్లలు పుట్టాలి లేదంటే, మీకిచ్చే కొన్ని నెలల గడువులో మీరు పిల్లల్ని కనకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు నేను చేసే దానికి మీరిద్దరూ బాధపడాల్సి ఉంటుంది అని ఇద్దరికీ వారిని ఇచ్చి వెళ్ళిపోతుంది. కుచన వెళ్లిన తర్వాత ఆర్య అనుని, ఓదారుస్తాడు అమ్మ అనే మాటలు గురించి పట్టించుకోవద్దు అని అంటాడు ఎలా పట్టించుకోకుండా ఉంటానండి నేను చెయ్యను తప్పుకు కూడా నన్ను ఆవిడ అంత పెద్ద మాటలు అంటుంటే నేనెలా భయపడకుండా బాధపడకుండా ఉంటాను అని అంటుంది. అమ్మ మాటలకి పట్టించుకోవద్దు ఆవిడ కోపంలో ఏదో ఒకటి అంటూ ఉంటుంది ఎప్పుడు తెలిసిందే కదా నీకు ఆవిడ గురించి ఇప్పుడు నువ్వు బాధపడడంలో అర్థం లేదు అని అంటాడు. ఇక అనుని కన్విన్స్ చేసి ఆర్య నచ్చజెప్పి అనుని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights

విక్కీ మనసు మార్చడానికి ప్రయత్నం..

ఇక పార్వతీ భక్త ఇద్దరు గుడికి వెళ్తారు. అక్కడ గుడిలో పార్వతి వికీ గురించి విక్కి అన్న మాటలు గురించి పద్మావతి బాధపడుతున్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఎదురుగా పంతులుగారు వచ్చి ఏంటమ్మా అలా ఉన్నారు అని అడుగుతాడు. పార్వతీ తన బాధని చెబుతుంది. పంతులుగారు అంతా విని, మీ సమస్యకి పరిష్కారం నేను చెప్తానమ్మా దీనికి ఒక పూజ ఉంది అది చేయండి అని చెప్తాడు. అలా చేస్తే మీ అమ్మాయి అల్లుడు ఇద్దరు సంతోషంగా ఉంటారు అని చెప్తాడు.దానికి పార్వతి చాలా సంతోషిస్తుంది. అది ఎంత పూజైనా ఎలాంటి పూజ అయినా ఖర్చు ఎంతైనా సరే చేస్తాము అని అంటుంది. పంతులుగారు దాంపత్య వ్రతం చేయాలి అని అంటాడు. అది ఎలా చేయాలి, చేసే విధానం నేను చెప్తాను ముందు మీరు వెళ్లి మీ పిల్లల్ని తీసుకొని రండి అని అంటాడు. అది ఈరోజే చేస్తే చాలా పుణ్యం వస్తుంది వాళ్ళిద్దరిని ఎవరు విడదీయాలి అనుకున్న విడదీయలేరు అని చెప్తాడు. పార్వతి బత్తా ఇద్దరు సంతోషించి పద్మావతి వికీలకు దాంపతి వ్రతం చేయించాలి అని నిర్ణయించుకొని వాళ్ళని గుడికి తీసుకు వస్తారు.

Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 04 2023 Episode 484 Highlights

గుడికి విక్కీ రాక.. పద్మావతి సంతోషం..

ఇక గుడిలో దాంపత్య వ్రతం చేయాలని చెప్పడంతో విక్కీ పద్మావతి, అను ఆర్య అందరూ గుడికి వస్తారు. నాకోసం మీరు గుడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది పద్మావతి. నేను నీకోసం రావట్లేదు పద్మావతి మీ ఇంట్లో మీ అమ్మానాన్నను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వాళ్ళింట్లో ఉంటూ వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఉన్న నాలుగు రోజులు వాళ్ళని సంతోష పెట్టాలని ఇలా గుడికి రావడానికి ఒప్పుకున్నాను. వాళ్ళు చెప్పిన పూజ చేయడానికి కూడా సరే అన్నాను అని అంటాడు. అయినా గుళ్లో పూజలు చేసినంత మాత్రాన మన మనసులో ఉన్నది పోతుందంటే నేను నమ్మను అని అంటాడు. పద్మావతి ఆ మాటలకి బాధపడుతుంది. ఇక గుడిలో కృష్ణ ని చూసి, ఆండాలు చాలా కోప్పడుతుంది. కృష్ణ వైపే ఇంట్లో అందరూ కోపంగా చూస్తూ ఉంటారు. ఈ నీచున్ని చూస్తుంటే నాకు పట్టలేనంత కోపం వస్తుంది రా అని తమ్ముడితో ఆండాలు చెబుతుంది. ఊరుకో అక్క అరవింద గారి ముందు బయట పడొద్దు అని అంటాడు. ఇదంతా కృష్ణ గమనిస్తాడు మీరు పద్మావతి వీకిలని కలపడానికి గుడికి తీసుకొచ్చారని నాకు తెలుసు కానీ నేను ఉండంగా అది జరగనివ్వను కదా అని అనుకుంటాడు మనసులో, ఇక అందరూ గుడిలోనికి వెళ్తారు. పద్మావతి శ్రీనివాసా ఈయన మనసు మార్చి ఈ గుడిలో నా మీద ప్రేమ కలిగేలా చేయి స్వామి అని దండం పెట్టుకొని లోపలికి వెళ్తుంది.

అదిరిపోయే ప్రశ్న వేసిన కుచల..

ఇక అందరూ గుడిలోకి వెళ్ళిన తరువాత పంతులుగారుతో, విక్కీ పద్మావతిని చూపించి వీరికి మీరు వ్రతం చేయించాల్సింది అని చెప్తారు. వెంటనే విక్కీ పంతులు గారితో, మీరు చేయించాల్సిన పూజ ఏదో త్వరగా కానీ చేస్తే నేను వెళ్తాను అని అంటాడు. అదేంటి బాబు అంత తొందర పడుతున్నావు ఆ పూజ గురించి నీకు కొంచెం చెప్పాలి అని పంతులుగారు మీరు చేయబోయేది దాంపత్య వ్రతం ఈ వ్రతానికి ముందుగా మీరు ఇరువురు వెళ్లి కొలనులో స్నానం చేసి, ఆ తరువాత మీరిద్దరూ గుడికి ప్రదక్షిణాలు చేసి, పట్టు బట్టలు కట్టుకొని పూజని మొదలు పెట్టాలి అని అంటాడు. ఇంత ప్రాసెస్ ఉందా ఇప్పుడు అదంతా చేయడం ఎలా కుదురుతుంది అని అంటాడు విక్కీ. దాంపత్య వ్రతం చేస్తేనే మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు బాబు ఈ వరదము ఎక్కడా నియమం తప్పకూడదు నిష్టగా చేయాలి అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అని పంతులుగారు చెప్తారు. ఆ మాటలకు అరవిందా ఏం కాదులే విక్కీ ఈ రోజు నీ పనులు పక్కన పెట్టు, పంతులు గారు చెప్పినట్టు చెయ్యి అని అంటుంది అక్క కోసం సరే అంటాడు విక్కీ. ఇక పంతులుగారు మొదలు పెడదామా అని అనేసరికి, కుచల, ఒక్క నిమిషం అని అందరినీ ఆపుతుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది కుచల, అందరూ ఎందుకు కుశల ఆపిందా అని ఆమె వైపు చూస్తూ ఉంటే, నాకు ఒక డౌట్ ఉంది అది ఇప్పుడు మీరు క్లారిఫై చేసి వెళ్ళండి అని అంటుంది. భక్తావైపు చూస్తూ, మీరు విక్కీ పద్మావతులకి మాత్రమే ఈ దాంపత్య వ్రతం చేయించాలి అని ఎందుకు అనుకుంటున్నారు అను ఆర్యాలు కూడా కొత్తగా పెళ్లయిన వాళ్లే కదా వాళ్ల మధ్య కూడా సంతోషంగా ఉండాలి అని అనుకోవాలి కదా అలాంటప్పుడు వీళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు దాంపత్య వ్రతం చేస్తున్నారు అని అడుగుతుంది ఆ మాటలకి భక్తా షాక్ అవుతాడు. కృష్ణ బలే అడిగా అత్తయ్య అని మనసులో అనుకుంటాడు. అను మీ సొంత కూతురు పద్మావతి అనాధ పిల్ల అయినా కానీ పద్మావతికే ఎందుకు చేయించాలి అని అనుకుంటున్నారు సొంత కూతురిని కూడా కాదనుకొని పద్మావతి సంతోషం కోసం చేయిస్తున్నారు అంటే ఇందులో ఏదో విషయం ఉంది ఆ విషయం ఏంటో ఇప్పుడు నాకు చెప్పి ఆ తర్వాత మీరు ఈ పూజకు బయలుదేరండి అని అంటుంది. ఇక విక్కీ పద్మావతి ల మధ్య జరిగిన విషయం అందరిలో ఎలా బయట పెట్టాలి, చెప్పకపోతే ఏం చెప్పి ఈ పూజ చేయించాలి అని భక్తా పార్వతి ఆండాలు ఆలోచిస్తూ ఉంటారు. పద్మావతి చాలా కంగారుపడుతుంది నాయన ఎక్కడ నిజం చెప్పేస్తాడు అని, ఇక అరవింద అదేం లేదులే పిన్ని వాళ్ళు, పద్మావతి వాళ్లకి చేయించాలని మొక్కుకున్నారేమో అని అంటుంది. అయినా కుచల వదిలిపెట్టదు కాదు ఏదో విషయం ఉంది అదేంటో వాళ్ళ నోటితో చెప్తే విందాం అని అంటుంది. కృష్ణ మనసులో నేనేదైతే జరగాలి అనుకున్నానో అదే జరుగుతుంది ఇప్పుడు ఏం చెప్పి పూజ చేయిస్తారో నేను చూస్తాను అని అనుకుంటాడు.ఇక పూజ జరుగుతుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

రేపటి ఎపిసోడ్లో ఇద్దరూ కలిసి దాంపత్య వ్రతం చేయడానికి వికీ పద్మావతులు కొలను స్నానం చేస్తూ ఉంటారు. విక్కి ఒకసారి త్వరలో మునిగిన తర్వాత నాకు చాలా చలిగా ఉంది అక్క నేను చేయలేకపోతున్నాను అంటాడు అరవిందతో, వెంటనే పద్మావతి మీకు చలి లేకుండా నేను చేస్తాను అని, విక్కీకి పద్మావతి ఇద్దరూ కలిపి, కొంగుముడి వేసుకొని స్నానం చేద్దాం అని అంటుంది. విక్కీ పద్మావతి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు.

author avatar
bharani jella

Related posts

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju