ట్రాఫిక్ పోలీసులు ఆపారా…! ఇది చెప్పండి చాలు…!!

 

 

ట్రాఫిక్ పోలీసులు ఆపారా…. ద్విచక్ర వాహనం, కారు  సంబంధించిన రిజిస్ట్రేషన్ పెపర్స్  ఇంటిలో మర్చిపోయారా… అయ్యో ఇప్పడు ఎలా… అని గాబరా పడుతున్నారా… అటువంటి టెంక్షన్ లకు ఇక చెక్ పెట్టేయండి. ..కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ  మోటర్ వాహనాల చట్టం 1989 నియమ నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకువచ్చింది.  చేపట్టిన మార్పులు వాహన దారుల సౌకర్యార్ధం అక్టోబరు ఫస్ట్ నుండి అమలులోకి రానున్నాయి.

గతంలో ట్రాఫిక్ పోలీసువారు తనిఖీలు చెపట్టినప్పుడు ముఖ్యంగా వెహికల్ కు సంబంధించిన ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి పేపర్స్ తప్పనిసరిగా చూస్తారు. వెహికల్ కు సంబంధించిన పేపర్స్ ఖర్మకాలి బండి లో లేవా… ట్రాఫిక్ పోలీస్ వారికి ఫైన్ కట్టక తప్పదు. ఎందుకంటే వెహికల్ కు సంబంధించిన ఫిజికల్ డాక్యుమెంట్స్ బండిలో తప్పని సరిగా ఉండాలి. వాటికి చెక్ పెడతానికి డిజి లాకర్ వంటి ప్రత్యేక టెక్నాలజీ ని రావాణా శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతొ సెల్ ఫొన్లో కేవలం సాఫ్ట్ కాపీలను చూపిస్తే సరిపోతుంది. కాని కొందరు ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి నేరుగా డాక్యుమెంట్స్ చూపించాలని ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి సందర్బాలలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ పై విధంగా మార్పులు చేసింది. అవి అక్టోబరు ఫస్ట్ నుండి అమలులోకి రాబోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తనిఖీలలో బాగంగా వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని అడగితే డిజిటల్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది. అవి చూపించిన తరువాత కూడా  అధికారులు ఫిజికల్ డాక్యుమెంట్స్ అడగ కూడదు. అలానే రోడ్డుపై వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన వేంటనే వాహన వివరాలు, సమయం, తేది వంటి వాటిని సంబంధిత అధికారి ఆన్ లైన్ లో నమోదు చేయాలి. తద్వారా ఆ వాహనాన్ని మరో ప్రదేశంలో అదే రోజు ఇతర అధికారులు తనిఖీ చేసే అవసరం ఉండదు. ఆ విధంగా చేయండం వలన ట్రాఫిక్ పోలీసుల సమయం ఆదా అవడమే కాకుండా వాహనదారుల ఇబ్బందులు తొలగిపోతాయి. కాగా పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచే వారిపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.

వాహన యజమానులు తమ వాహనానికి సంబంధించిన పత్రాలను కేంద్ర ప్రభుత్వం పోర్టల్ అయిన డిజి లాకర్ లేదా ఎం-పరివాహన్  లో నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయండం వలన వాహనాలకు సంబంధించిన పత్రాలు వెంట తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎదైనా సమయంలో అధికారులకు పత్రాలు చూపించాల్సిన అవసరం ఏర్పడితే ఆన్ లైన్ లో పొందు పర్చిన పత్రాలు చూపిస్తే సరిపోతుంది. మారిన ఈ నిబంధనలు అక్టోబరు ఒకటి నుండి అమలు కాబోతున్నాయి.