YS Jagan: “ఒకే ఒక్కడు” సినిమా.. అర్జున్ ని తలపించిన సీఎం జగన్..!!

Share

YS Jagan: 1999వ సంవత్సరంలో శంకర్(Shankar) దర్శకత్వంలో అర్జున్(Arjun) హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా.. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమాలో పాటలు శంకర్ టేకింగ్… సినిమా మొత్తానికే హైలైట్. సినిమాలో మొదటి లో ఒక రోజు ముఖ్యమంత్రి గా అర్జున్.. చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సమాజంలో అవినీతి పరులను అదే రీతిలో ఇష్టానుసారంగా వ్యవహరించే రాజకీయ నాయకులను రీతిలో అర్జున్ సీఎంగా… వంతు ఎక్కడ అవినీతి జరిగితే అక్కడికి అక్కడ అవినీతికి కారకుడైన వ్యక్తి ని సస్పెండ్ చేస్తూ… సామాన్య ప్రజలకు భరోసా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదే మాదిరిగా “ఒకే ఒక్కడు”(Oke Okadu) సినిమా తలపించే రీతిలో సీఎం జగన్(YS Jagan) వరద పర్యటన లో ఒక సన్నివేశం చోటు చేసుకుంది.

Oke Okkadu Movie | Arjun's Introduction As A C.M - YouTube

విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా..(Kosthaa) రాయలసీమ(Rayalaseema) ప్రాంతాలలో మొన్న కురిసిన భారీ వర్షాలకు సామాన్య ప్రజలు ఇల్లు, భవనాలు.. దెబ్బతినగా రైతుల పంట పొలాలు నీట మునిగిపోయాయి. రాయలసీమలో చాలా నష్టం వాటిల్లింది. ఇటువంటి తరుణంలో మొదటిగా ఏరియల్ సర్వే చేసిన జగన్ నిన్న మొన్న రెండు రోజులపాటు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పర్యటించి వరద బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు.

CM Jagan promises new houses for flood-hit

ఈ క్రమంలో ఓ మహిళ తనకి ఉన్న భూమి విషయంలో అన్యాయం జరిగిందని… ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగటం జరిగిందని దానికి సంబంధించిన అర్జీలను.. సీఎం జగన్ కి చూపించడం జరిగింది. దీంతో సదరు మహిళ చూపించిన అర్జీలను భూమి పట్టా మొత్తం పరిశీలించి… ఆమెకు అన్యాయం జరిగిందని జగన్ గుర్తించి దానికి కారకుడైన విఆర్వో అక్కడికక్కడే… జగన్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో… సామాన్య జనులు ఒకే ఒక్కడు సినిమా ని.. జగన్ గుర్తు చేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సన్నివేశం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో చోటుచేసుకుంది.


Share

Related posts

Behaviour: మీ మాట తీరు ఇలా ఉంటే ఏమవుతుందో తెలుసా ??(పార్ట్ -1)

siddhu

లోక్ సభ నుంచి టిడిపి సభ్యుల సస్పెన్షన్

Siva Prasad

సంఘ్ కుట్రలు చేస్తోంది జాగ్రత్త: చంద్రబాబు

somaraju sharma