Healthy hair: ప్రస్తుతం ప్రతి ఒక్కరి సమస్య జుట్టు రాలిపోతుండటం తోపాటు త్వరగా జుట్టు తెల్లగా మారటం. ఈ సింపుల్ చిట్కాల ను మీరుపాటిస్తే, తెల్ల జుట్టు సమస్య తో పాటూ జుట్టు రాలడం కూడా ఉండదు . ఎందుకంటే కొన్ని వందల ఏళ్లుగా మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నవి ఇవే.
గుప్పెడు వేపాకులు గిన్నె లోకి తీసుకుని అందులో అరలీటరు నీరు పోసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత వడగట్టుకుని కుదుళ్లకు ,జుట్టుకు రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారిచేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది .
రాత్రి పడుకునే ముందు ఒక చిన్న కప్పు లో పెరుగుతీసుకుని అందులో కొన్ని మెంతులు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే పెరుగు, మెంతులను బాగా మెత్తగా మిక్సీ పట్టుకుని,ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకుని ఒక 30 నిముషాలు ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్యతగ్గిపోతుంది.
కలబంద గుజ్జు ను వెంట్రుకుల కుదుళ్ళ నుండి తలకుపట్టించుకుని అరగంట పాటు ఆరినతర్వాత, తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
ఒక గ్లాస్ నీటి లోకొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీరు చల్లారిన తర్వాత తలకు బాగా మర్దన చేసుకుని ఆరిన తర్వాత తలస్నానం చేస్తే తెల్ల జుట్టు సమస్యకుచెక్పె ట్టినట్టే.
ఉల్లిపాయను బాగా గుజ్జుగా చేసుకుని,వచ్చిన రసాన్ని తలకు రాసుకుని అరగంట ఆరిన తర్వాత తలస్నానం చేయడం వలన తెల్ల జుట్టు సమస్య తో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులుతెలియచేస్తున్నారు.
కాస్త నిమ్మ రసం తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉసిరి పొడి గానీ ఉసిరి కాయ నుండి తీసిన రసం గానీ కలుపు కున్నా ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకుని 20 నిముషాలు ఆరిన తర్వాత తలస్నానం చేస్తే ,జుట్టు రాలే సమస్య మరియు జుట్టు రంగు మారడం సమస్య నుండి విముక్తి పొందవచ్చు. పై న చెప్పిన చిట్కాలలో ఏదైనా సరే వారానికి ఒకసారి చేస్తే చాలని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. దానితో పాటు తీసుకునే ఆహారం లో ఎక్కువగా కరివేపాకు ఉండటం వలన జుట్టు రాలడం, రంగు మారడంసమస్యలు ఉండవని తెలియచేస్తున్నారు.