ట్రెండింగ్ న్యూస్ సినిమా

వామ్మో….! దుర్గా రావు క్రేజ్ చూస్తే మెండ్ పోతుంది..!

Share

తమలోని ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్ మీడియా ఎంతోమందికి ఒక సాధనంగా ఉపయోగపడింది. మారుమూల పల్లెల్లో ఉన్న వారు కూడా తమ టాలెంట్ ను దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకు చూపించుకునేందుకు ఈ ప్లాట్ఫామ్ ను అందరూ ఎంచుకున్నారు. డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి ఎన్నో అప్లికేషన్ల ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా స్టార్స్ అంటూ వీరంతా ఒక గ్రూప్ కూడా అయిపోయారు.

 

ఇక అన్ని అప్లికేషన్లలో టిక్ టాక్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వారిలో సెలబ్రిటీలు ఉన్నారు…. బయటికి వెళ్తే జనాలు గుర్తు పడుతున్నారు కూడా. ఇలా టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారిలో దుర్గా రావు పేరు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో పాపులర్ అయింది. తన భార్యతో కలిసి సెట్టింగులు, డాన్సులు వేసే దుర్గా రావు ఢీ డాన్స్ షోలో డ్యాన్సర్ పండు వల్ల మరింత ఫేమస్ అయ్యాడు. నాది నక్కిలీసు గొలుసు అనే పాటకు దుర్గారావు టిక్ టాక్ లో వేసిన డాన్స్ షో వేదికపై పండు ఆ స్టెప్పులు వేయగా ఇద్దరూ ఫేమస్ అయ్యారు.

ఆ తర్వాత దుర్గారావు పూర్తిగా బిజీ అయిపోయాడు. అటు బుల్లితెర, ఇటు వెండితెర అతని క్రేజ్ ను విపరీతంగా వాడుకుంటుంది. ఈ మధ్య క్రాక్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేశాడు. ఆ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలా సినిమా ఆఫర్లను కూడా దుర్గారావు వరుసగా అందుకుంటున్నాడు. ఇక తాజాగా కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో దుర్గారావు కనిపించాడు. అతని చేత స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా చేయించారు. ఇక మనవాడు మరింత రెచ్చిపోయి వెరైటీ స్టెప్పులు వేశాడు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై దుర్గారావు హవా మామూలుగా లేదు.


Share

Related posts

‘ఇది రాజద్రోహం కాదా’!

Siva Prasad

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేషన్ లో ఈ కంటెస్టెంట్ వెళ్ళిపోతే బిగ్ బాస్ చూడడమే ఆపేస్తారు…! 

arun kanna

Krishnam Raju: ప్ర‌భాస్ విష‌యంలో కృష్ణంరాజు కోరిక‌ నెర‌వేరేనా..?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar