Omicron Effect: కీలక నిర్ణయం తీసుకున్న సీఎం స్టాలిన్.. మరో సారి లాక్ డౌన్..కానీ..

Share

Omicron Effect: దేశంలో కరోనా మహమ్మారి మరో సారి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. రోజు వారి కేసుల నమోదు 90 వేలకు పైగా చేరుకోవడంతో థర్డ్ వేవ్ ప్రారంభమైన సంకేతాలు వస్తున్నాయి. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో పది రెట్లు కేసులు పెరిగాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో థర్డ్ వేర్ కు కారణం అవుతోంది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ 2,630కి నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.

Omicron Effect Tamil Nadu cm key decision
Omicron Effect Tamil Nadu cm key decision

Omicron Effect: ప్రతి ఆదివారం లాక్ డౌన్

ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో సీఎం స్టాలిన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తమిళనాడులో సినిమా హాళ్లు, మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆదివారం లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్న సీఎం స్టాలిన్..విద్యాసంస్థలకు ఆంక్షలను విధించారు. ఆరవ తరగతి నుండి 9వ తరగతి వరకూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని స్టాలిన్ సర్కార్ నిర్ణయించింది.

9వ తరగతి వరకూ ఆన్ లైన్ క్లాస్‌లు

ఇప్పటికే తమిళనాడులో 120కిపైగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో మరికొన్ని కఠిన ఆంక్షలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇదే క్రమంలో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. దేశంలోని మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర 797 కేసులతో ముందు వరుసలో ఉండగా 485 కేసులతో ఢిల్లీ రెండవ స్థానంలో, 236 కేసులతో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉంది.


Share

Related posts

Elaichi: ఒక్క యాలుకను తిని గ్లాసు వేడి నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా..!!

bharani jella

Jr.NTR – Prabhas: ప్రభాస్ కు అతిపెద్ద ఛాలెంజ్ విసిరిన జూనియర్ ఎన్టీఆర్..!!

bharani jella

Steelbird Faceshield: సేల్స్ లో దూసుకెళ్తున్న ఈ ఫేస్ షీల్డ్ ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే..!!

bharani jella