Omicron Symptoms in Childrens: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో థర్త్ వేర్ విజృంభన కొనసాగుతోంది. దేశంలో, రాష్ట్రంలో రోజు వారి కొత్త కేసుల నమోదు సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 13వేలకు పైగా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఒమిక్రాన్ బరినపడిన పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలను బట్టి పిల్లలు కోవిడ్ బారినపడినట్లు నిర్ధారణ చేసుకోవచ్చు.
Omicron Symptoms in Childrens: పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి
ఫిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం… కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన పిల్లల్లో 44 శాతం మంది ఎక్కువగా నరాల సంబంధించిన లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలిందట. ఆ అధ్యయన ఫలితాలు పీడియాట్రిక్ న్యూరాలజీ జర్నల్ లో ప్రచురించారు. కోవిడ్ బారిన పడిన పిల్లలకు ఆ వైరస్ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఆ పిల్లల్లో ఎక్కువ నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15 నుండి 18 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతోంది కానీ చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
లక్షణాలు కనబడితే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించండి
చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ద చేయకుండా వెంటనే కోవిడ్ లక్షణాలుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలు జ్వరంతో పాటు తలనొప్పితో బాధపడుతుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించండి. కోవిడ్ సోకిన చిన్నారుల్లో తలనొప్పి లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన జలుబు, పొడి దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కూడా కోవిడ్ కు దారి తీస్తాయి. ఈ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. సాధారణ జ్వరంగా భావించి సొంత వైద్యంతో మందులు పిల్లలకు ఇవ్వకూడదు. వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. వైరస్ బారిన పడిన పిల్లలు మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉన్నందున పరిస్థితులు మరింత దిగజారకముందే డాక్టర్ ను సంప్రదించి పిల్లలకు చికిత్స చేయించడం మంచిది.