Omission: హైదరాబాద్‌లో ఒమైక్రాన్ కలకలం …! రెండు కేసులు నిర్ధారణ..!!

Share

Omission: తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో తొలిసారిగా రెండు ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ నుండి కోల్‌కతాకు వెళ్లిన మరో యువకుడికి ఒమైక్రాన్ ఉన్నట్లు గుర్తించారు. కాగా ఆ ప్రయాణీకుడు వెళ్లిన తరువాత ఒమైక్రాన్ వేరియంట్ ను గుర్తించారు. హైదరాబాద్ లో రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులను తెలంగాణ సర్కార్ అప్రమత్తం చేసింది. కెన్యా, సోమాలియా నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులకు కోవిడ్ పాజిటివ్ అని తేలిసింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమైక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. ఈ నెల 12వ తేదీన కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ హైదరాబాద్ కు వచ్చారు. ఆమెకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమైక్రాన్ నిర్ధారణ అయినట్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ టోలీచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించారు. బాధిత మహిళలకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా సేకరించినట్లు ఆయన తెలిపారు.

Omicron variant cases in Telangana
Omicron variant cases in Telangana

Omission: తండ్రి వైద్యం కోసం ఆసుపత్రులకు తిరిగిన ఒమైక్రాన్ బాధితుడు

సోమాలియా నుండి వచ్చి 23 ఏళ్ల వ్యక్తికి కూడా ఒమైక్రాన్ సోకినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి నగరంలోని పారమౌంట్ కాలనీలో పోలీసులు గుర్తించారు. బాధితుడిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్ కి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి వైద్య సిబ్బంది టెస్టులు చేస్తున్నారు. అయితే పరీక్షలకు నమూనాలు ఇచ్చేందుకు కొంత మంది స్థానికులు నిరాకరిస్తున్నారు. ఇప్పటి వరకూ బాధితుడు ఎంత మందిని కలిశాడన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సోమాలియాకు చెందిన బాధితుడు తన తండ్రి వైద్యం కోసం నగరానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ వైద్యం కోసం నగరంలోని అపోలో, యశోదా ఆసుపత్రికి వైద్యం కోసం తిరిగిట్లు తెలుస్తోంది. నగరంలోని రెస్టారెంట్, పలువురు ఇళ్లకు వీరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.  బాధితుడి తండ్రి శాంపిల్స్ తీసుకుని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఒమైక్రాన్ సోకిన మూడవ వ్యక్తి ఏడేళ్ల బాలుడు కాగా అతను రాష్ట్రంలోకి ప్రవేశించలేదనీ, బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి అంతర్జాతీయ విమానంలో వచ్చి అదే విమానంలో పశ్చిమ బెంగాల్ కు వెళ్లిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ బాలుడు వెళ్లే ముందు ఇచ్చిన శాంపిల్ ను పరీశీలించగా అతనికి ఒమైక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికారులకు చేరవేసినట్లు హైల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

నగరంలో రెండు ఒమైక్రాన్ కేసులు వెలుగు చూడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒమైక్రాన్ సైతం గాలి ద్వారా సోకుతుందనీ, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, రెండు రోజుల్లోనే డబుల్ అయ్యే సామర్ధ్యం ఉంటుందని వైద్యాధికారులు వెల్లడిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒమైక్రాన్ సోకిన వారికి చాలా స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వ్యాక్సిన్ లు తీసుకున్న వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఒక వేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్దంగా ఉన్నామని డీహెచ్ వెల్లడించారు.


Share

Related posts

IAS Officers Transfer: 16 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..

somaraju sharma

జ‌గ‌న్‌కు కేంద్రం గుడ్ న్యూస్‌… నిజంగా తీపి క‌బురే

sridhar

AP Govt: ఏపి డిప్యూటి సీఎం నారాయణ స్వామికి సర్కార్ షాక్..! మేటర్ ఏమిటంటే..?

somaraju sharma