OMRICAN: అరగంటలోపే ఒమిక్రాన్ టెస్ట్ రిజల్ట్.. ఎలాగంటే …?

Share

Omrican: కరోనా థర్డ్ వేవ్ గురించి తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని అనుకునే లోపే మళ్ళీ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రూపంలో ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఈ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌ వణికిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు డెల్టా వేరియెంట్ కన్నా ప్రమాదకరం అని నిపుణులు చెప్పడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ భయంతో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు అధికారులు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇలా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసి దాని ఫలితం రావడానికి చాలా సమయం పట్టడంతో ఎయిర్ పోర్టులు అన్ని ప్రయాణికులతో రద్దీ అయిపోయింది.

FILE – Dr. Manjul Shukla transfers Pfizer COVID-19 vaccine into a syringe, Thursday, Dec. 2, 2021, at a mobile vaccination clinic in Worcester, Mass. Pfizer said Wednesday, Dec. 8, 2021, that a booster dose of its COVID-19 vaccine may protect against the new omicron variant even though the initial two doses appear significantly less effective. (AP Photo/Steven Senne, File)

TDP Janasena: టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన బిగ్ షాక్..? కీలక ప్రతిపాదనపై టీడీపీలో మల్లగుల్లాలు..??

ఈ కిట్ ను ఎవరు రూపొందించారంటే:

ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఫలితాలు త్వరగా వచ్చేలా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ విభాగం ఆర్‌టీ-లాంప్‌ (RT-LAMP) అనే కొత్త కొవిడ్‌ కిట్‌ ను తయారుచేసింది. ఎవ్వరి అవసరం లేకుండా సులభంగా ఈ కిట్‌తో మీకు మీరే ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ చేసుకోవచ్చట. అలాగే ఈ కిట్ ద్వారా కరోనా ఉందా లేదా అనేది కేవలం అరగంటలోనే తెలుస్తుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. రోజుల తరబడి నిరక్షణ లేకుండా ఫలితాలు త్వరగా వచ్చేలా ఐసీఎంఆర్ ఈ కొత్త రకం కిట్ ను రూపొందించింది.

Carona: ఈ కరోనా కాలం లో పిల్లలను ఇలా కాపాడుకోండి!!
కొత్త కిట్ ఎంతవరకు పనిచేస్తుందో:

అలాగే ఈ కిట్ వందశాతం సమర్థవంతంగా పని చేయడంతో పాటు కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని తెలిపింది. ఇతర కొవిడ్‌ పరీక్షల కంటే ఈ ఆర్‌టీ-లాంప్‌ టెస్ట్ కిట్ యొక్క ధర కూడా 40% తక్కువగానే ఉంటుందట.ఈ కిట్స్ ను ప్రజలకు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడం కోసం ఢిల్లీ, చెన్నైలోని పలు కంపెనీలకు వీటి నమూనాలు పంపించడం జరిగిందని.. అందులో అన్ని విజయవంతం అయితే మరో రెండు వారాల్లోనే ఈ కొత్త కొవిడ్‌ కిట్‌ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది అని ఐసీఎంఆర్‌ తెలిపింది. అంతేకాకుండా ఈ కిట్ ఎయిర్ పోర్టు, ఓడరేవులు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ లలో ఉన్న ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని” ఐసీఎంఆర్‌ వివరించింది.


Share

Related posts

YS Jagan: కరోనాతో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

sekhar

హాస్పిటల్ లో ఉన్న విజయ్ సాయి రెడ్డి కి గుడ్ న్యూస్ ?

sekhar

వకీల్ సాబ్ డైరెక్టర్ జీవితం కన్నీటి మయం ..!

GRK