Vijaydeverakonda: దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే పలు కొత్త సినిమాలు రిలీజ్ కావడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో టాలీవుడ్‌పై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వటం జరిగింది. మేటర్ లోకి వెళితే దసరా పండుగ రోజు ముందు రాత్రి సోషల్ మీడియాలో అభిమానులతో.. చిట్ చాట్ చేసిన.. విజయ్ దేవరకొండ అ బంపర్ ఆఫర్ లు ఇవ్వడం జరిగింది. అభిమానులు చేసిన కామెంట్ లకు రిప్లై ఇస్తూ మరోపక్క వారి కోరికలకి… గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. సందడి చేశాడు.
ఈ క్రమంలో అభిమాని కోరిక మేరకు అతని ఇంటికి.. భోజనానికి వస్తానని.. విజయ్ దేవరకొండ మాట ఇవ్వడం జరిగింది. మరోపక్క మీతో లైగర్ సినిమా చూడాలని ఉందని మరో అభిమాని కోరడంతో తప్పకుండా నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీ ఊరు థియేటర్లోనే… “లైగర్” సినిమా చూద్దామని… విజయ్ దేవరకొండ మాట ఇచ్చాడు. ఇదిలావుంటే ఇటీవల విజయ్ దేవరకొండ అతిపెద్ద ఏవిడి మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దియేటర్లో దాదాపు ఏడాది పాటు సినిమా ఫ్రీ గా చూసేందుకు.. పర్మిషన్ ఇవ్వాలని కోరడంతో… విజయ్ దేవరకొండ దానికి కూడా ఓకే చెప్పాడు. అంత మాత్రమే కాక.. లైగర్ సినిమాని అభిమానులతో.. విజయ్ సొంత థియేటర్ లో చూద్దామని అందరికీ ప్రామిస్ చేశాడు. మరోపక్క ఇదే సమయంలో ప్రభాస్ నీ.. కలవటానికి మీరు హెల్ప్ చేయాలని అనటంతో దానికి కూడా ఓకే చెప్పాడు.
విజయ్ దేవరకొండ టచ్ లో లేడు….
ఈ విధంగా దసరా ముందు రోజు సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తు మరోపక్క తన సినిమా షూటింగ్ లో.. బిజీగా ఉంటూనే.. సరికొత్త బంపర్ ఆఫర్లు ఇచ్చాడు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా కాలం అభిమానులకు దూరంగా ఉంటూ పెద్దగా విజయ్ దేవరకొండ టచ్ లో లేడు. సరిగ్గా దసరా ముందు రోజు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులను ఇంటరాక్ట్ అయ్యి.. వాళ్ల కోరికలకు ఓకే చెప్పడం సోషల్ మీడియాలో.. వైరల్ గా మారింది.