నాలుగో సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా అభిజిత్ గెలవటం అందరికీ తెలిసిందే. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి చాలా కామ్ అండ్ మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఎవరినీ తనని కంట్రోల్ చేసే రీతిలో కాకుండా ప్రతి పరిస్థితి క్యాండీల్ చేసే తరహాలో అభి ఆడిన గేమ్ చాలా మందిని ఆకట్టుకుంది. దీంతో ఓటింగ్ పరంగా నాలుగో సీజన్ లో మొదటి నుండి రికార్డులు సృష్టిస్తూ నే ఉన్నాడు.
అందువల్లే 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఒక్క సారి కెప్టెన్ కాకపోయినా అభి గెలిచినట్లు తాజాగా బయట జనాలు చెప్పుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న అభి బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలు గురించి చెప్పుకొస్తున్నాడు. ఇదిలా ఉండగా టైటిల్ విన్నర్ గా 50 లక్షలు మాత్రమేకాక ట్రోఫీ అందుకున్నా అభి.. మొత్తం మీద 85 లక్షలు గెలుచుకున్న ట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా మూడు లక్షల విలువ గల స్టైలిష్ బైక్ ను కూడా అభిజిత్ బోనస్ గా గెలుచుకున్నటు టాక్ వస్తోంది. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో భారీ స్థాయిలోనే తన తలరాత మార్చుకున్నట్లు అభి గురించి బయట జనాలు చెప్పుకుంటున్నారు.