నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వి’. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ – హర్షిత్ రెడ్డి నిర్మించారు. అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. కరోనా మహమ్మారి గత మార్చ్ చివరై వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా. లా అలా పోస్ట్ అవుతూ వచ్చి ఈ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.
ఇక నాని కెరీర్లో 25వ సినిమాగా రాబోతున్న వి పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాని ని అష్టా చమ్మా సినిమాతో హీరోగా చేసిన దర్శకుడితోనే నాని 25 తెరకెక్కడం. గత కొంతకాలంగా సరైన సక్సస్ లేక ఇబ్బందులు పడుతున్నాడు నాని. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితేగాని నాని మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి రాడు. అందుకే ప్రమోషన్స్ బాగానే చేస్తున్నాడు.
మరో హీరోగా నటించిన సుధీర్ బాబు కూడా డూప్ లేకుండానే చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ చేశాడని చెప్పుకుంటున్నారు. అయిరే నాని వి సినిమా ఒక్క రోజు ముందు ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసి షాకిచ్చాడు. ఇప్పటి వరకు నాని నటించిన సినిమాలకంటే ఈ సినిమా చాలా డిఫ్రెంట్ గా ఉంటుందట. రెగ్యులర్ గా నాని సినిమాలో ఉండే అంశాలను ఈ సినిమాలో ఆశించ వద్దని అంటున్నాడు. సరిగ్గా రిలీజ్ కి ఒకరోజు ముందు ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే ఆడియన్స్ ముందు గానే ప్రిపేర్ చేయడమా అని టాక్ మొదలైంది.