Kangana ranauth : మరోసారి కంగన క్లారిటీ..!

Share

Kangana ranauth : బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘తలైవి’. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వాస్తవంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్, ఆ తర్వాత కరోనా సెకండ్ వేక్ కారణంగా లాక్ డౌన్, థియోటర్స్ మూతపడటంతో ఆగిపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగనా పోస్టర్స్, అలాగే టీజర్స్, ట్రైలర్, సాంగ్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

once again kangana-ranauth clarity
once again kangana-ranauth clarity

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, హిందీ.. తమిళం.. తెలుగు భాషల్లో విడుదలకి సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు అరవిందస్వామి ఎఐఎడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దిగ్గజ నటుడు ఎంజీఆర్ పాత్రలో కనిపించబోతుండటం విశేష. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. కాగా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను ఏప్రిల్ 23న విడుదల నుంచి పోస్ట్ పోన్ అయింది. దాంతో ఇప్పటికే పలుమార్లు ‘తలైవి’ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటికి దర్శకుడు, నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అలాగే కంగన కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ రూమర్స్ ఆగడం లేదు. సినిమా చూడాలనే తాపత్రయంతో కొందరు ఓటీటీ రిలీజ్ అని తప్పుడు ప్రచారం చేసేస్తున్నారు.

Kangana ranauth : ముందు థియేటర్లోనే విడుదలయ్యాకే డిజిటల్ రిలీజ్ అని కంగనా స్పష్టం చేసింది.

దాంతో మరోసారి కంగనా క్లారిటీ ఇస్తూ ఆ వార్తలని కొట్టిపారేసింది. గత రెండు మూడు రోజుల నుంచి ‘తలైవి’ సినిమాకు సంబంధించి మళ్ళీ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కంగనా గట్టిగా రిప్లై ఇచ్చింది. మా తలైవి విడుదల తేదీని ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు. దయచేసి పుకార్లకి దూరంగా ఉండండి. రూమర్స్ ని నమ్మవద్దు. అధికారకంగా చెప్తాము. దేశవ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ చేసినప్పుడే ‘తలైవి’ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేస్తామని ప్రకటించింది కంగన. దీని ముందు కూడా ‘తలైవి’ తమిళ డిజిటల్ హక్కులని అమెజాన్, హిందీ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నాయని, కానీ ఈ రెండు ప్లాట్ ఫాంలలో సినిమా స్ట్రీమింగ్ ఇప్పుడే కాదని, ముందు థియేటర్లోనే విడుదలయ్యాకే డిజిటల్ రిలీజ్ అని కంగనా స్పష్టం చేసింది.


Share

Related posts

Vijay Sethupathi : థియేటర్లో లెక్కలు రాసుకుంటూ – ఉత్తమ నటుడిగా..! సింగిల్ టేక్, సింగిల్ షాట్..!!

Srinivas Manem

తెర‌పైకి `థెరి`రీమేక్‌…

Siva Prasad

Happy Life జీవితం సుఖం గా ఉండడానికి భార్య భర్తకు మన పెద్దలు చెప్పిన కొన్ని సూచనలు!!(పార్ట్-1)

Kumar