మరోసారి ఆఫర్లతో అదరగొట్టనున్న ఫ్లిప్ కార్ట్..!

ఒకప్పుడు ఒక పండగ వస్తుందంటే.. ఒక నెల ముందు నుంచే హడావిడి మొదలయ్యేది. పండగకు ఇంట్లోకి కావలసిన వస్తువుల నుంచి.. వేసుకునే బట్టల వరకు ఎంతో దూరం పోయి ఎక్కడెక్కడో షాపింగ్ చేస్తే కానీ పండగకు కావలసినవి అన్నీ దొరికేవి కావు. కానీ ఎప్పుడైతే ఆన్లైన్ షాపింగ్ వచ్చిందో.. ఉప్పు, పప్పు మొదలు.. టీవీ, రిఫ్రిజిటర్ వరకు. చిన్న పిల్లల గౌన్ల నుంచి పట్టుచీరల వరకు అన్నీ దొరికే చోటులా మారిపోయింది. దాని వాడకం మా కంటే మీకే ఎక్కువ తెలుసు కదా..

ఇప్పుడు విషయానికి వస్తే.. మొన్నటి వరకు బిగ్ బిలియన్ డే పేరిట ఫ్లిప్ కార్ట్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు కదా.. ఆఫర్లతో జనాలను ఆగం చేసింది. డిస్కౌంట్లతో ఒక ఊపుఊపింది. రూ.70వేల ఫోన్ 20వేలకు అమ్మి జనాల నోళ్లలో నానింది.

మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా “బిగ్ దివాళి సేల్” పేరిట మరో సేల్ తీసుకురానుంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4 వరకు ఈ సేల్ ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్స్‌కు సేల్‌లో కూడా ముందుగా పాల్గొనే అవకాశం కల్పిస్తోంది.

ఏడు రోజుల పాటు నడిచే ఈ సేల్‌లో యాక్సిస్‌‌ బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు యూజర్లకు 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇతర బ్యాంకు కార్డులపై నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం లభించనుంది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ లానే ఈ సేల్‌లోనూ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. ముఖ్యంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌41, గెలాక్సీ ఎస్‌20+, గెలాక్సీ ఏ50ఎస్‌తో పాటు పోకో ఎం2, ఎం2 ప్రో, పోకో సీ3, ఒప్పో రెనో 2ఎఫ్‌, ఏ52, ఎఫ్‌15, రియల్‌మీ నార్జో 20 సిరీస్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ ఇవ్వబోతోంది. అలాగే ఒక్క రూపాయికే మొబైల్‌ ప్రొటెక్షన్‌ అందించనుంది. దీంతో పాటు మంచి మంచి ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందించనుంది. మీరు కూడా ఒక లుక్ వేయండి.. మీకు కావలసిన వస్తువులు ఉన్నాయేమో..