Romance: శృంగారం పూర్తి అయ్యాక భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని కలిసే నిద్రలోకి జారుకోండి. దీనివల్ల పరస్పరం మీ ప్రేమను తెలియజేసుకుంటూ హాయిగా నిద్రపోవచ్చు. ఒకసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత..నిద్రపోవడం మామూలే. కానీ అలా కాకుండా చిన్న చిన్న చిలిపి పనులు చేయడం, శృంగారం గురించి తరచి తరచి మాట్లాడుకోవడం వంటివి చేస్తే.. మీ భాగస్వామి మళ్ళి వెంటనే శృంగారం కావాలి అని అనాల్సిందే..
శృంగారం తర్వాత ఇద్దరూ ఒకరికి ఇష్టమైన ఆహారాన్ని మరొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఉండడం వలన మీ ఆకలి తగ్గి, శక్తి స్థాయి పెరగడం తో పాటు.. మీ భాగస్వామిపై మీకున్న ప్రేమ స్పష్టంగా వారికి తెలుస్తుంది.ఈసారి శృంగారం పూర్తి కాగానే ఎవరి దారిన వాళ్ళు పడుకోకుండా శృంగారం తర్వాత కూడా మరింత ఎక్కువగా మీ భాగస్వామి శరీరాన్ని తాకడం వలన మీ స్పర్శ కి మీ మనసులో ఉన్న ప్రేమ వారికి స్పష్టంగా అర్థం అవుతుంది.శృంగారం పూర్తి అయిన తర్వాత ఏ జంట అయితే సరదాగా నవ్వుతూ ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారో వారి మధ్య అనుబంధం బాగా బలపడుతుందని పలు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కొన్ని సార్లు మనం మాటల్లో చెప్పలేని భావాలు కళ్ళతో చాలా స్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పవచ్చు .
అందుకే ఈసారి శృంగారం లో పాల్గొన్న తర్వాత మీ భార్యాభర్తలిద్దరూ ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ మీ మనసులో ఉన్న భావాలను ఎదుటివారికి తెలియజేసేందుకు ప్రయత్నించండి. ఇలాంటివి చేయడం వల్ల ద్వారా కలకాలం మీ వైవాహిక బంధం పునాదులను మరింత దృఢంగా అయ్యేలా చూసుకోండి. పైన చెప్పిన విధం గా చేయడం వలన మీ బంధం దృఢమవడం తో పాటు మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?