కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

నాసిక్ డిసెంబర్ 25: ఉల్లిగడ్డల ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గామ్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు కిలో రూపాయికే ఉల్లిగడ్డలు విక్రయించారు.

గత ఏడాది కూడా కిలో ఉల్లిగడ్డలు రూపాయికే విక్రయించిన సంగతీ తెలిసిందే. పొలాల నుంచి ఉల్లిగడ్డలను మార్కెట్ కు తీసుకువచ్చేందుకు అయిన రవాణ చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చెస్తున్నారు. ధరలు పేరిగె వరకు రైతులు ఉల్లిని గోదాముల్లో నిల్వ చేసుకోవాలని మార్కెట్‌లో మంచి ధరలు వచ్చిన తరువాత విక్రయించు కోవాలని మార్కెట్  అధికారులు రెత్తులకు సూచిస్తున్నారు.