NewsOrbit
Featured న్యూస్

తూచ్‌.. ర‌ష్యా వ్యాక్సిన్‌కు తొలి ద‌శ ట్ర‌య‌ల్సే పూర్త‌య్యాయి.. చివ‌రివి కావు..!

ర‌ష్యాలోని సెచెనోవ్ యూనివ‌ర్సిటీలో కోవిడ్ వ్యాక్సిన్‌కు గాను చివ‌రి ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాయ‌నే వార్త‌లు ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి రెండు ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతం అయ్యాయ‌ని, అందులో భాగంగానే చివ‌రి ద‌శ ట్ర‌య‌ల్స్ చేప‌ట్టార‌ని, అతి త్వ‌ర‌లోనే వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని అనేక భార‌తీయ మీడియా సంస్థలు, వార్తా ప‌త్రిక‌లు, చాన‌ళ్లు, వెబ్‌సైట్లు ఈ వ్యాక్సిన్‌పై క‌థ‌నాల‌ను రాశాయి. అయితే వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిజ‌మే కానీ.. అవి చివ‌రి ద‌శ ట్ర‌య‌ల్స్ కాద‌ని, కేవ‌లం మొద‌టి ట్ర‌య‌ల్స్ మాత్ర‌మే పూర్త‌య్యాయ‌ని స‌ద‌రు యూనివ‌ర్సిటీ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

only phase 1 trials completed not phase 3 for russian covid vaccine

కోవిడ్ 19కు తాము త‌యారు చేసిన వ్యాక్సిన్‌కు కేవ‌లం మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్ మాత్ర‌మే పూర్త‌య్యాయ‌ని సెచెనోవ్ యూనివ‌ర్సిటీ తెలిపింది. ఇంకా ఫేజ్ 2, 3 ద‌శ‌లు పెండింగ్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. మొద‌టి ద‌శ‌లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ల‌ను జూలై 15, 20 తేదీల్లో డిశ్చార్జి చేస్తామ‌ని త‌రువాత రెండో ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతాయ‌ని తెలిపింది. ఇక వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ అన్నీ పూర్త‌యి ప్ర‌జా పంపిణీకి అందుబాటులోకి వ‌చ్చేందుకు క‌నీసం ఇంకో 6 నెల‌ల స‌మ‌యం అయినా ప‌డుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. అందువ‌ల్ల డిసెంబ‌ర్ వ‌ర‌కు త‌మ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంద‌న్నారు.

అయితే మ‌రోవైపు ఈ విష‌యాన్ని భార‌తీయ మీడియా సంస్థ‌లు త‌ప్పుగా అర్థం చేసుకున్నాయ‌న్నారు. త‌మ వ్యాక్సిన్ కేవ‌లం మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్ మాత్ర‌మే పూర్త‌య్యాయ‌ని, చివ‌రి ద‌శ కాద‌ని తెలిపారు. కానీ అనేక మీడియా సంస్థ‌లు మాత్రం ర‌ష్యా వ్యాక్సిన్ వ‌చ్చేసింద‌ని క‌థ‌నాల‌ను వండి వ‌డ్డించాయి. చివ‌ర‌కు అస‌లు విష‌యం తెలిసి నాలుక క‌రుచుకుంటున్నాయి.

కాగా ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్‌లో 15 నుంచి 30 మందికి వ్యాక్సిన్ ఇచ్చి ప‌రీక్ష చేస్తారు. ర‌ష్యాలో పూర్త‌యిన ట్ర‌య‌ల్స్ ఇవే. ఫేజ్ 2లో వ్యాక్సిన్ సేఫ్టీ, స‌మ‌ర్థ‌త‌ను ప‌రీక్షిస్తారు. ఫేజ్ 3లో వాలంటీర్ల‌కు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇచ్చి ప‌రీక్షిస్తారు. ఫేజ్ 4లో వ్యాక్సిన్ పంపిణీకి అనుమ‌తి ఇస్తారు. ఇన్ని ద‌శ‌లు దాటాకే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంది.

author avatar
Srikanth A

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N