NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ ప్రజలు డైరెక్ట్ గా ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు .. ఖచ్చితంగా షేర్ చేయండి !

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలిలో సంక్షేమం అభివృద్ధి అజెండాతో ప్ర‌జ‌ల పురోగ‌తికి కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలు పైసా ఖర్చు లేకుండా ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేస్తే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. వీటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఆయా శాఖలకు సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్లను, సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే వీటి ముఖ్యోద్దేశం.

100 (పోలీసు సేవలు)

100 నంబ‌రు గురించి అనేక‌మందికి తెలిసిన సంగ‌తే. ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ 24 గంటలూ పని చేస్తుంది.

101 (అగ్నిమాపక కేంద్రం)

ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు.

104 (వైద్యం, ఆరోగ్యం)

ప‌ల్లె సీమ‌ల వైద్య సేవ‌ల‌ను 104 పున‌ర్ నిర్వ‌చించింది. ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. అలాగే ఆస్పత్రిలో ప్రసవాంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ అంబులెన్స్‌ సేవలు కూడా అందిస్తున్నారు.

108 (ప్రభుత్వ అంబులెన్స్‌)

వైద్య సేవ‌ల్లో విప్ల‌వాత్మ‌క మార్పు 108. అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ప్రమాదాలకు గురై, గాయపడిన వారు 108కు ఫోన్‌ చేయవచ్చు. కాల్‌ సెంటర్‌ నుంచి సమీపంలోని 108 వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు.

112, 181 (దిశ)

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల్లో ఈ టోల్ ఫ్రీ నంబ‌రు ఒక‌టి. హైదరాబాద్‌లో ఓ యువతిపై జరిగిన అమానవీయ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపులకు గురవుతున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తమను కాపాడుకొనేందుకు బాలికలు, యువతులు, మహిళలు ఈ నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.ఆపదలో ఉన్న మహిళలు 112 లేదా 181 నంబర్లకు ఫోన్‌ చేస్తే కంట్రోల్‌ రూము నుంచి వారు ఫోన్‌ చేసిన ప్రదేశాన్ని గుర్తించి, సమీపంలోని స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్రమత్తమైన ఆ పోలీసు అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు.

1902 (ప్రజా సమస్యలు)

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలకు సంబంధించిన సమాచారం ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే లభిస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి, సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేయవచ్చు. గడువు తేదీలోగా వాటిని పరిష్కరించుకోవచ్చు. లేకుంటే మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. దీనివలన అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి.

1907 (వ్యవసాయం)

వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ నంబరుకు ఫోన్‌ చేయవచ్చు. సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు.

1912 (విద్యుత్‌ సేవలు)

విద్యుత్‌ సరఫరాలో, సిబ్బంది వల్ల సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి, పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది

14400 (అవినీతి నిరోధం):

వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్‌ కేటాయించారు. 14400 నంబరుకు ఫోన్‌ చేసిన వారి పేరు, వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.

14500 (ఇసుక, మద్యం)

ఎక్కడైనా సారా అమ్మకాలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిస్తే 14500 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. దీనిద్వారా మద్యం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా సాయం పొందవచ్చు. అలాగే ఇసుక డోర్‌ డెలివరీ పొందాలనుకొనే వారు కూడా ఈ నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు.

author avatar
sridhar

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju