రాయేగా వేశారు?

అమరావతి, డిసెంబర్ 27: ఉత్తిత్తి స్టీల్ ప్లాంట్‌కు శంఖుస్థాపన చేసి చంద్రబాబు మరొక డ్రామా ఆడారు, రాయేగా పోయిందేముందని వేసేశారు అంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇటువంటి అమలుకు నోచుకోని చంద్రన్న రాళ్ళు రాయలసీమలో చాలా ఉన్నాయి, అసలు గనుల వివరాలు అధ్యయనం చేయకుండా పొందుపరచకుండా సీమ ప్రజలను మరొక సారి మోసం చేస్తున్నారని ట్వీట్ చేశారు.
విభజన చట్టంలో ఉన్నా కూడా స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, అందుకే ఏపీ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి పూర్తి చేసే బాధ్యత తీసుకుందని సీఎం చంద్రబాబు రిట్వీట్ చేశారు.