Aha : తెలుగు ఓటీటీ ఆహా నేషనల్ వైడ్ పాపులర్ అయిన అమెజాన్ ప్రైం, జీ 5, నెట్ఫ్లిక్స్ గట్టి పోటీ ఇస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సహా సౌత్ అన్నీ భాషలలోని సినిమాలను అమెజాన్ ప్రైం, జీ 5, నెట్ఫ్లిక్స్ లలో రిలీజ్ చేస్తున్నారు. అంతకముందు కంటే గత ఏడాది కరోనా తర్వాత నుంచి ఓటీటీలలో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకి బాగా అలవాటు పడ్డారు. దాంతో చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఈ మధ్యకాలంలో తెలుగు ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ చేసేందుకు రైట్స్ తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ మూవీస్ ని ఆహా రైట్స్ చేజిక్కించుకుంది. వీటికి ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉంది. సినిమాల మీద ప్రేక్షకుల్లో హిట్ అవుతాయనే టాక్ కూడా బలంగా ఉంది. అందుకే ఆహా వీటికి భారీ ఆఫర్ ఇచ్చి రైట్స్ తీసుకుంది. ఆ మూడు సినిమాలలో ఉంది లవ్ స్టోరి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరి. ఇందులో అక్కినేని నాగ చైతన్య – ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించారు. ఏషియన్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ మొదటి సారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ ఈ సినిమాని నిర్మించారు.
Aha : ఇతర భాషల సినిమాలని డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు.
అలాగే అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పిస్తుండగా జీఏ2 బ్యానర్ మీద బన్నీ వాస్ నిర్మించారు. ఇక యంగ్ హీరో నాగశౌర్య మూవీ ‘లక్ష్య’. ఫుల్ యాక్షన్ ప్యాక్ గా నిర్మిస్తున్న ఈ మూవీని ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది. తాజాగా వీటి రీమేక్ రైట్స్ ని ఆహా తీసుకున్నారు. ఈ సినిమాలతో ఆహాకి మరింత ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇలా సినిమాలను రిలీజ్ చేస్తూనే మరొకవైపు పలు టాక్ షోలను, వెబ్ సిరీస్ లను అందిస్తున్నారు. ఇతర భాషల సినిమాలని డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!