షేక్ హసీనా ప్రమాణ స్వీకారానికి విపక్షాల గైర్హాజర్

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్షాలు గైర్హాజరయ్యాయి. ఇటీవల జరిగిన బంగ్లా దేశ్ ఎన్నికలలో అవామీ లీగ్ ఘన విజయం సాధించి వరుసగా మూడో సారి అధికారంలోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత్రి షేక్ హసీనా ఈ రోజు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులూ ప్రమాణ స్వాకారం చేశారు.

అయితే ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష సభ్యులు గైర్హాజరయ్యారు. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి హసీనా విజయం సాధించారని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసందే. బంగ్లాదేశ్ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో 17 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.