అంతటితో ఆగకుండా తన దేశంలో సొంతంగా రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. కరెన్సీ నాణేలు కూడా బంగారంతో చేసినవని చెబుతున్నాడు.వెనక్కి వెళితే మన దేశం లో నిత్యానంద స్వామి మీద అత్యాచారం ఆరోపణలున్నాయి భూముల స్వాహా కేసులున్నాయి.అనేక విధాలుగా బ్రష్టు పట్టి పోవడంతో ఈ నిత్యానందస్వామి నకిలీ పాస్ పోర్ట్ తో వేరే దేశానికి చెక్కేశాడు.ఇప్పుడు నిత్యానందస్వామి ఈక్వెడార్ నుంచి చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.
దానికి కైలాస అని పేరు పెట్టారు. ఆ దేశంలో ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రధాన మంత్రిని తన భక్తుడినే నియమించారు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దేశానికి ప్రత్యేకంగా పాస్ పోర్ట్ ను రూపొందించారు. జెండాను, జాతీయ చిహ్నాన్ని కూడా విడుదల చేశారు.తాజాగా తమ కైలాస దేశానికి కరెన్సీని రూపొందించి ఏకంగా రిజర్వు బ్యాంకును కూడా ఏర్పాటు చేసి దాని వినాయకచవితి నాడు ప్రారంభించేశాడట.
కరెన్సీకి సంబంధించి పలు దేశాలకు చెందిన బ్యాంకులతో కూడా చట్టబద్ధంగా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.ఈ స్వామి సొంత దేశం ఏర్పాటు చేసుకున్నా ఏ దేశం పట్టించుకోక పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సరే… నిత్యానందస్వామి పిచ్చి విషయం పక్కన పెడదాం. ఇతడు పారిపోయి ఇంత హంగామా చేస్తుంటే కూడా భారతదేశం ఎందుకని పట్టించుకోవడం లేదు అన్నది ప్రధాన ప్రశ్న.గత ఏడాది నుంచి నిత్యానంద స్వామి పరారీలో ఉన్నట్లు భారత్ లో రికార్డులున్నాయి.
మరి భారత్ నిత్యానంద అరెస్ట్ కు ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. హిందుత్వ దేశంగా ప్రకటించుకున్న నిత్యానందను మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేసి దేశానికి తీసుకువస్తుందా? లేదా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు సూటిగానే ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడైనా మోడీ ప్రభుత్వం తగిన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అది చర్య రూపంలో ఉంటే ప్రజలు ప్రశంసిస్తారు!
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…
బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్ అంతటా పెంచేందుకు కరణ్…
ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…
కొందరు హత్యాచారం లాంటి నేరాలు చేసి సాక్షం దొరకకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ పరిశీలన, సాంకేతిక ఆధారాలతో పోలీసులు.. దోషులను పట్టుకుంటారు.…