న్యూస్ సినిమా

Mahesh Babu: పాన్ ఇండియా సినిమా చేయకపోయినా నెంబర్ వన్ లో మహేష్ బాబు..!!

Share

Mahesh Babu: టైమ్స్ ఉత్తమ సెలబ్రిటీ జాభితా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఇంతలోనే మరో ప్రముఖ సంస్థ ముంబై కి చెందిన ఒర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన మెయిన్ స్టార్ జాబితాలో మహేష్ నెంబర్ వన్ ప్లేస్ దక్కించుకోవడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది. ఏటువంటి పాన్ ఇండియా మూవీ చేయకపోయినా మహేష్ మొదటి స్థానం దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో అల్లు అర్జున్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నరు. కానీ ఈసారి మహేష్ తర్వాత బన్నీ రెండో స్థానంలో నిలవడం జరిగింది.

Ormax Media on Twitter: "Ormax Stars India Loves: Most popular male Telugu  film stars (June 2021) #OrmaxSIL… "

మూడో స్థానంలో పవన్ కళ్యాణ్, నాలుగో స్థానం లో ప్రభాస్, ఐదో స్థానంలో ఎన్టీఆర్, ఆరో స్థానంలో.. రామ్ చరణ్, ఏడో స్థానంలో విజయ్ దేవరకొండ, ఏనిమిదో స్థానంలో  నాని, తొమ్మిదో స్థానంలో చిరంజీవి, పదవ స్థానంలో రవితేజ నిలిచారు. ప్రముఖ సంస్థ కావటంతో ఈ లిస్ట్ లో ముగ్గురు మెగా హీరోల ఉండటంతో మెగా అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడాదికి పైగా ఇటువంటి సినిమాలు చేయకపోయినా మహేష్ మొదటి స్థానంలో ఉండటంతోపాటు అలా వైకుంఠపురం లో సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టి పుష్ప సినిమాతో ట్రెండింగ్ అవుతున్న రెండో ప్లేస్లో ఉండటం ఇద్దరు హీరోల అభిమానులు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక పవన్ విషయానికి వస్తే ఒక పక్క జనసేన మరో పక్క రీఎంట్రీ సినిమాలతో ట్రేడింగ్ అవుతూ ఉండటం తో మూడో ప్లేస్ సాధించినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read More: Mahesh : మహేష్ బర్త్ డేకి సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్

నాలుగో ప్లేస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. కూడా ఇదే రీతిలో చేస్తున్న సినిమాల ఆధారంగా వార్తల్లో నిలిచిన నాలుగో స్థానాన్ని దక్కించుకున్నట్లు ఇక ఐదు ఆరు స్థానాల్లో ఉన్న చరణ్ ఎన్టీఆర్.. రాజమౌళి సినిమా పుణ్యమా అని ట్రెండింగ్ అయ్యి.. ఆ స్థానాలు రాబట్టినట్లు భావిస్తున్నారు. ఇదే రీతిలో విజయ్ దేవరకొండ కూడా చేస్తున్న సినిమా ఆధారంగానే.. ఈ ప్రముఖ సంస్థ జాబితాలో చోటు దక్కించుకున్నట్లు అనుకుంటున్నారు. ఇక చిరంజీవి మహమ్మారి కరోనా కారణంగా ఇండస్ట్రీలో సినీ కార్మికులకు అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ట్రెండింగ్ అయ్యి తొమ్మిదవ స్థానం లో నిలిచినట్లు అభిమానులు అంచనా వేయడం జరిగింది. ఏది ఏమైనా మహేష్ ఓర్మక్స్ పాపులర్ తెలుగు హీరోలలో.. మొదటి స్థానం దక్కటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.


Share

Related posts

KTR: అగ్నిపథ్ పథకాన్ని అందుకే తీసుకువచ్చారా..? తెలంగాణ మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు

somaraju sharma

Pawan Kalyan: స్పెషల్ పూజ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!!

sekhar

Bhagat Singh Bhavadiyudu: “భగత్ సింగ్ భవదీయుడు” లో పవన్ క్యారెక్టర్..లీక్ చేసేసిన హరీష్ శంకర్…!!

sekhar