Prabhas Mahesh: “బాహుబలి 2” రూపంలో వచ్చిన విజయం ఇంకా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నీ సుస్థిర స్థానం లో నిలబేడుతూనే ఉంది. “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాదేశ్యం రెండు కూడా.. అట్టర్ ఫ్లాప్. అయినా కానీ ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు. ప్రముఖ మీడియా సంస్థ ORMAX మే నెలలో అత్యంత ఆదరణ పొందిన టాలీవుడ్ హీరోలకి సంబంధించి సర్వే చేయగా మొదటి స్థానంలో ప్రభాస్, రెండవ స్థానంలో మహేష్, మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, నాలుగవ స్థానంలో అల్లు అర్జున్, ఐదవ స్థానంలో రామ్ చరణ్ తేజ్, ఆరో స్థానంలో పవన్ కళ్యాణ్, ఏడవ స్థానంలో నాని, ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ, 9వ స్థానంలో చిరంజీవి, పదవ స్థానంలో రవితేజ నిలిచారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాదాపు మెగా హీరోల్లో ఒక్క అల్లుఅర్జున్ మినహా మిగతా వాళ్లు పెద్దగా తన క్రేజ్ కి తగ్గ రీతిలో రాణించ లేదని తాజా ర్యాంకింగ్స్ పై మెగా ఫ్యాన్స్ అంటున్నారు. రెండో స్థానంలో మహేష్ రావడంలో తప్పు లేదని.. ఎందుకంటే దాదాపు 4 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారని తాజా ర్యాంకింగ్స్ పై బయట జనాలు కామెంట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి మూడో స్థానం రావడం పట్ల తారక్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
“RRR” లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇవ్వటం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో.. తారక్ కి మూడో స్థానం రావడంలో తప్పు లేదని చెప్పుకొస్తున్నారు. ఇక నాలుగో స్థానంలో బన్నీ నిలవడం పట్ల కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి నాలుగో స్థానం రావడం పట్ల ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. మిగతా హీరోలకు వారి వారి స్థానాలు రావటం వాళ్ళ అభిమానులు.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.