OTS Scheme: ఈ అంశంలో టీడీపీకి పాయింట్ దొరకలేదేమో..? వ్యతిరేకత వస్తుందని ఆగిందా..?

Share

OTS Scheme: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ నూతనంగా పేద వర్గాలకు ఎంతగానో ఉపయోగపడేందుకు అంటూ తీసుకువచ్చిన ఓటీఎస్ పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పక్క ఈ పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా మరో పక్క లబ్దిదారుల నుండి స్పందన కనబడుతూనే ఉంది. లబ్దిదారులు ఎవరూ ఓటిఎస్ పథకంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదనీ, తాము అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవేమో అన్న భయం లబ్దిదారుల్లో ఉంది. దీంతో స్తోమత ఉన్న లబ్దిదారులు ఓటీఎస్ కింద డబ్బులు చెల్లిస్తున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న వారు అప్పోసప్పో చేసి కడుతున్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలు తీసుకుని మరీ ఓటిఎస్ కు డబ్బులు కడుతున్నారు. మరి కొందరు టీడీపీ వాళ్లు ఎవరైనా హైకోర్టులో పిల్ దాఖలు చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. జగన్మోహనరెడ్డి సర్కార్ తీసుకువచ్చే ప్రతి పథకం, జీవోలపై పిల్ వేసే ప్రతిపక్ష టీడీపీ.. ఈ అంశంపై ఎంతుకు కోర్టును ఆశ్రయించడం లేదన్న ఆలోచన చేస్తున్నారు.

OTS Scheme tdp opposed
OTS Scheme tdp opposed

OTS Scheme: వైసీపీ ప్రశ్నకు సమాధానం చెప్పలేని టీడీపీ

ఓటిఎస్ పథకం కింద డబ్బులు చెల్లించవద్దని చెబుతున్న టీడీపీ.. ఆ ప్రభుత్వ హయాంలో ఈ బకాయిలను ఎందుకు మాఫీ చేయలేదనీ, వేలాది మంది లబ్దిదారుల నుండి డబ్బులు ఎందుకు కట్టించుకున్నారని వైసీపీ ప్రశ్నిస్తే దానికి వారి నుండి సమాధానం లేదు. అయితే ఈ పథకాన్ని జనసేన, సీపీఐ నేతలు విమర్శిస్తున్నారు. అసలే పేద కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో ఉంటే వారి నుండి ముక్కు పిండి వసూలు చేయడం ఏమిటని ఆయా పార్టీల నేతల ప్రశ్నించారు. దీంతో సర్కార్ ఒక మెట్టు దిగింది. ఈ పథకం పూర్తి గా స్వచ్చందమేనని, బలవంతం ఏమీ లేదని పేర్కొంది. ఒటిఎస్ కింద డబ్బులు చెల్లిస్తే వారికి ఆ ఆస్తి పై పూర్తి హక్కు ఏర్పడుతుందనీ, డిఫాం పట్టా స్థానంలో రిజిస్టేషన్ పత్రాలు అందజేయడం జరుగుతుందని, దీని వల్ల వారు భవిష్యత్తులు తనఖా రుణాలు తీసుకోవాలన్నా, విక్రయించుకోవాలన్నా ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలియజేస్తోంది వైసీపీ సర్కార్.

లా పాయింట్ ఏమీ దొరకలేదా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం అమలునకు 22ఏ చట్టానికి సవరణ చేసింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు 83వ నంబర్ జీవోను తీసుకువచ్చింది. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు చెల్లించిన లబ్దిదారులకు కూడా రిజిస్ట్రేషన్ లు చేస్తామని ప్రకటించింది. ఈ పథకంపై టీడీపీ ఆందోళన చేస్తుంది, డబ్బులు చెల్లించవద్దని చెబుతుంది కానీ కోర్టు ద్వారా జీవో రద్దుకు ప్రయత్నించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ జీవో పై లా పాయింట్ ఏమీ దొరకలేదా లేక పేద వర్గాల నుండి వ్యతిరేకత వస్తుందన్న భావనతో ఆగిందా అనే మాటలు వినబడుతున్నాయి.


Share

Related posts

షాకింగ్: 20 వేల మంది అమెజాన్ ఉద్యోగులకు కరోనా

Varun G

Yash Remuneration: ‘కేజీయఫ్ 2’ కోసం యష్ తీసున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వలిసిందే ??

Naina

Chandrababu : చంద్ర‌బాబు కు గ్యాప్ ఇవ్వ‌కుండా జ‌గ‌న్ ఏం చేస్తున్నారంటే…

sridhar