OTT Platforms: ఊహించని పోటీతో దుమ్మురేపుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌.. ఇక ప్రేక్షకులకు పండగే!

Share

OTT Platforms: కరోనా సమయంలో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కరోనా నుంచి బయటపడ్డ తరువాత కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాయి. నిజానికి సినిమాలు థియేటర్లలో లాస్ తెచ్చినా ఓటీటీ దయవల్లే మూవీ నిర్మాతలు గట్టెక్కుతున్నారు. అయితే ఇండియన్‌ ప్రేక్షకులకు మొట్టమొదటిగా బాగా దగ్గరైన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదైనా ఉందీ అంటే అది అమెజాన్ ప్రైమ్ వీడియో అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ సరసమైన ధరలతో ప్లాన్‌లు తీసుకొచ్చి సరికొత్త సినిమాలను ప్రేక్షకులకు చూపించింది. అయితే ఇప్పుడు అమెజాన్‌కు ఇతర ఓటీటీలు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఒక్క అమెజాన్‌కే కాదు అన్నిటికీ అన్ని భాషల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కో ఓటీటీ ఫ్యాన్సీ ప్రైస్‌ను నిర్మాతలకు అందించి సరికొత్త మూవీలను చాలా తొందరగా రిలీజ్ చేస్తున్నాయి.

OTT Platforms: ఓటీటీల మధ్య తీవ్ర పోటీ

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ కూడా తెలుగు సినిమాలపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు మేజర్, విరాట పర్వం, అంటే సుందరానికి మూవీలతో సహా త్వరలో విడుదల కానున్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ కూడా నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. అలానే ఈ ఏడాదిలో ‘రాధే శ్యామ్’ (హిందీ), ‘బీస్ట్’, ‘గంగూబాయి కతియావాడి’, ‘జన గణ మన’, ‘డాన్’ – ఆర్ఆర్ఆర్ (హిందీ) వంటి చాలా ఇండియన్ సినిమాలు కొనుగోలు చేసింది.

ఇండియన్ ఓటీటీలు పోటీకి సై

దేశీయ ఓటీటీ సంస్థ జీ5 ఓటీటీ కూడా బలమైన పోటీ ఇస్తోంది. బంగార్రాజు, వలిమై సినిమాలతో పాటుగా ఈ ఏడాది సంచలన విజయం సాధించిన ది కశ్మీర్ ఫైల్స్‌ని జీ5 సొంతం చేసుకుంది. దీంతో ఈ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య బాగా పెరిగింది. వ్యూస్ కూడా ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ఇక 100% తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఆహా ఓటీటీ సైతం మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. డిస్నీ + హాట్ స్టార్ కూడా తానేం తక్కువ తినలేదు అన్నట్లుగా స్టార్ హీరోల సినిమాలు కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఇది ‘అఖండ’, ‘భీమ్లా నాయక్’ తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. త్వరలో సూపర్ హిట్ చిత్రం ‘విక్రమ్’ స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇలా చాలా ఓటీటీలు అమెజాన్ ప్రైమ్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రతి ఓటీటీ ఒకదానికొకటి పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలన్నిటినీ చాలా తొందరగా కొనేస్తున్నాయి. అలాగే స్ట్రీమ్ కూడా చేస్తున్నాయి. ఫలితంగా ప్రేక్షకులు చాలా త్వరగా సినిమాలను చూడటం వీలవుతుంది. మరి భవిష్యత్తులో ఇండియాలో ఏ ఓటీటీ సంస్థ అగ్రస్థానం సంపాదిస్తుందో చూడాలి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

19 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago