నాని సినిమాకి బాలీవుడ్ లో కోట్లు కుమ్మరిస్తున్నారట ..?

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని సినిమాలన్ని మినిమం గ్యారెంటీ అన్న టాక్ ని తెచ్చుకున్నాయి. నాని సినిమాలకి భారీ గా లాభాలు రాకపోయినా నిర్మాత మాత్రం సేఫ్ గా బయటపడతాడు. ఇక నాని ఎంచుకునే కథలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయన్న సంగతి తెలిసిందే. హిట్, ఫ్లాప్ అన్న మాట పక్కన పెడితే నాని నుంచి మాత్రం సినిమాలు వరసగా వస్తూనే ఉన్నాయి. అయితే టాలీవుడ్ లో నాని నటించిన సినిమా ఒకటి బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

What the Hell! Climax of Nani's Jersey in their hands? | Telugu Movie News  - Times of India

ఇక్కడ నాని – శ్రద్ద శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ మంచి సక్సస్ ని సాధించింది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మించగా నిర్మాతకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక నాని కి ఈ సినిమాతో మంచి హిట్ దక్కింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు దక్కించుంది. కాగా ఈ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో నిర్మిస్తున్నారు.

Shahid Kapoor Impresses in pre-look of Jersey Hindi Remake

బాలీవుడ్ లో అల్లు అరవింద్, దిల్ రాజు తో పాటు అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తుండగా తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌతం తిన్నినూరి హిందీ జెర్సీని తెరకెక్కిసున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకి చేరుకున్న ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ ల నుంచి భారీ ఆఫర్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కొసం అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇస్తూ మాకిమ్మంటే మాకిమ్మని అడుగుతున్నారట. అందుకు కారణం కబీర్ సింగ్ తర్వాత బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రేంజ్ ఊహించనంతగా పెరిగిపోయింది. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా. అందుకే ఈ రేంజ్ లో ఆఫర్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మరి మేకర్స్ ఓటీటీ కి ఇచ్చేస్తారా లేదా థియోటర్స్ లో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.

SHARE