తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో బాగా పాపులర్ అయిన షోలలో ఒకటి బిగ్ బాస్ రియాలిటీ షో. ప్రపంచవ్యాప్తంగా ఈ షో కి మంచి క్రేజ్ ఉంది. ఇండియాలో హిందీ లో మొదలైన షో తెలుగు లో కూడా మొదలయ్యే ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే మూడవ సీజన్ లో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్ పునర్నవి. అంతకుముందు ఉయ్యాల జంపాల సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన గాని పెద్దగా గుర్తింపు దక్కలేదు పునర్నవికి.
కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షో లో సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ అన్న తరహాలో ఎపిసోడ్ నడవడంతో.. పునర్నవి భూపాలం కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా హౌస్ నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తూ తన హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో అభిమానుల తో చిట్ చాట్ చేయడం జరిగింది.
ఈ క్రమంలో మీ న్యూడ్ ఫోటోలు.. పోస్ట్ చేయాలని అతడి వేసిన ప్రశ్న కి పునర్నవి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. చేతికి ఉండే ఐదువేల లో మధ్యలో వేలు చూపించి.. రాయలేని పదాన్ని సిగ్నల్ రూపంలో చూపించింది. పునర్నవి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడికక్కడ తెగ కొట్టడంలో పునర్నవి స్టైలే వేరు అంటూ చాలామంది ఈ పోస్టు చూసి మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ప్రశ్న వేసిన ఆ నెటిజన్ కి గట్టిగా బుద్ధి కూడా చెబుతున్నారు.