(“న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాపై ప్రపంచ వ్యాప్తంగా ఆశలు పెట్టుకొని ఉండగా క్రినికల్ ట్రయల్స్‌ను నిలిపివేశారు. మూడో దశ ట్రయల్స్‌లో తేడా కొట్టింది. బ్రిటన్‌లో టీకా వేయించుకున్న ఒ వాలంటీర్‌కు వ్యాక్సిన్ వికటించి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీందో తుది దశకు చేరుకున్న క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా ఫార్మా వెల్లడించింది. వ్యాక్సిన్ భద్రతపై మరో మారు పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించాల్సి ఉన్నందున క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది.
కరోనా కోసం రష్యా తయారు చేసిన స్పుత్నిక్ – వి వ్యాక్సిన్ వ్యాక్సిన్ వచ్చినా పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయకుండానే వ్యాక్సిన్ విడుదల చేశారన్న అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో అందరూ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. వ్యాక్సిన్ రేసులో అస్ట్రాజెనెకా ముందంజలో ఉండటంలో ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. ఈ దశలో ఆక్స్ఫర్డ్ అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు నిలిచిపోవడం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను నిరుత్సాహానికి గురి చేస్తున్నది.