NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

Congress: అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరల అదే నియోజకవర్గాల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ పరిణామాలు ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను ఆందోళనకు గురి చేస్తుంది.

ఇంతకు ముందు ముగ్గురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక కేంద్ర మాజీ మంత్రి వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలకు చెందిన వారే. నందికొట్కూరు, చింతలపూడి, పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్ధర్, ఎలిజా, ఎంఎస్ బాబు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ లు వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ అధిష్టానం అభ్యర్ధిత్వాలు ఖరారు చేసింది.

YSRCP

అలానే శ్రీకాకాళం మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆమెకు టెక్కలి అసెంబ్లీ అభ్యర్ధిగా కాంగ్రెస్ ప్రకటించింది. అదే విధంగా ఇటీవలే వైసీపీకీ రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ షర్మిలను కలిశారు.

Congress

తాజాగా మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం పీ గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఇవేళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మరో సారి పోటీ చేయాలని భావిస్తుండగా, వైసీపీ అధిష్టానం ఆయనను కాదని, విప్పర్తి వేణుగోపాల్ కు అవకాశం కల్పించింది. దీంతో అప్పటి నుండి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబు .. ఈ రోజు (శనివారం) పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి ఆమె సమక్షంలో పార్టీలో చేరారు.

చిట్టిబాబుకు షర్మిల పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీలో చేరికతో మరల తన సిట్టింగ్ స్థానం పీ గన్నవరం నుండి పోటీ చేసే అవకాశం ఏర్పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తదుపరి విడుదల చేసే అభ్యర్ధుల జాబితాలో పీ గన్నవరం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, చీరాల నుండి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అభ్యర్ధిత్వాలను ఖరారు చేసే అవకాశం ఉంది.

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?