Paagal Review: పాగల్ మూవీ రివ్యూ

Paagal Review Vishwak Sen Shines in a mediocre subject
Share

Paagal Review: విశ్వక్ సేన్ హీరో గా నివేత పేతురాజ్, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రాధన్, లియోన్ జేమ్స్ మ్యూజిక్ సమకూర్చిన ఈ చిత్రం ఈరోజు థియేటర్ల ముందుకు వచ్చింది. ట్రైలర్ ద్వారా ఈ సినిమాకి మంచి లభించగా చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ‘పాగల్’ ఎలా ఉందో చూద్దాం…

 

Paagal Review Vishwak Sen Shines in a mediocre subject

కథ: 

ప్రేమ్ (విశ్వక్ సేన్) చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకుంటాడు. అప్పటినుండి అతను నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఏ అమ్మాయి తనని నిజంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేమిస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి కలిసిన ప్రతి ఒక్క అమ్మాయితో ప్రేమాయణం నడపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంత పెద్ద ప్రపంచంలో అతనికి తను నిజంగా ప్రేమించే అమ్మాయి దొరుకుతుందా…? ఒకవేళ నిజంగా అలాంటి అమ్మాయి ఉంటే అది తనే అని అతను ఎలా తెలుసుకుంటాడు? ఈ క్రమంలో అతను ఏమేమి కోల్పోతాడు…? అన్నది మిగిలిన కథ

పాజిటివ్స్:

  • హీరో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో బాగుంది. లవర్ బాయ్ గా అతని క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమించే పాత్రలో విలక్షణత కనపరిచాడు విశ్వక్.
  • ఈ సినిమాలో సంగీతం చాలా బాగుంది. రెండు మూడు పాటలు మంచి చార్ట్ బస్టర్లు గా నిలిచాయి. సినిమాటోగ్రఫీ కూడా పెద్ద సినిమాల రేంజ్ లో ఉంది.
  • మొదటి అర్ధ భాగంలో వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పూర్తి స్థాయి లవ్ స్టోరీ లో ఈ తరహా కామెడీ పెట్టడం నిజంగా సాహసమనే చెప్పాలి. అయితే ఇది థియేటర్ లో మాత్రం బాగా వర్కౌట్ అయింది.

నెగిటివ్స్:

  • సినిమా రెండవ అర్ధ భాగం మొత్తం చాలా స్లోగా సాగుతుంది. మొదటి అర్ధ భాగంలో ఉన్న ఫ్లో రెండవ అర్ధ భాగంలో మిస్ అయింది.
  • సినిమాలోని పాటలు, సంగీతం బాగున్నప్పటికీ అవసరం లేని సందర్భాలలో పాటలు పెట్టడం… కావాలని అన్నీ పాటలు సినిమా లో ఉండాలి అన్నట్లు ఇరికించడం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.
  • పూర్తిస్థాయి ఎమోషన్ మీద నడవవలసిన ఈ కొత్త తరహా ప్రేమ కథ లో ఆ ఎమోషనే మిస్ అయ్యింది. చాలా చోట్ల ఎమోషన్ ప్రేక్షకులకి కనెక్ట్ కాదు. కాబట్టి ఈ కథ ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న ఉద్దేశ్యమే ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లోనికి నెట్టేస్తుంది.

Paagal Review – విశ్లేషణ:

మంచి కథాంశంతో తెరకెక్కిన ‘పాగల్’ చిత్రంలో ఖచ్చితత్వం లోపించింది. మొదటి అర్ధభాగం ఎంత బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుందో… రెండవ అర్ధ భాగం అంతే బోర్ కొట్టిస్తుంది. కథ కొత్తగా ఉంది… ప్రధాన తారాగణం నటన బాగుంది కానీ రెండవ భాగం సినిమాని పూర్తిగా చెడగొట్టింది. టోటల్ గా టాలీవుడ్ నుంచి మరొక బిలో-యావరేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల వద్దకు వచ్చింది.

చివరి మాట: పాగల్… థియేటర్ వద్ద ఢమాల్


Share

Related posts

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ క్రష్ హీరోయిన్ డీటెయిల్స్..!!

sekhar

Smartphone: మీ ఫోన్ నీళ్ళల్లో పడిపోయిందా? మరేం పర్లేదు ఇలా చెయ్యండి చాలు!!

Naina

కృష్ణాష్టమి రోజు రామ భజన…!!

sekhar