Paagal Teaser : టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వెళ్లిపోమాకే సినిమా త పరిచయమయ్యాడు ఈ హైదరాబాద్ కుర్రాడు.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.. ప్రస్తుతం నూతన దర్శకుడు నరేష్ కొప్పల్లి దర్శకత్వంలో పాగల్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా పాగల్ టీజర్ ను విడుదల చేశారు..
Advertisements

ఈ సినిమాలో విశ్వక్ తన రొమాంటిక్ యాంగిల్ ను చూపించనున్నారు. పాగల్ చిత్రంలో నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది.దిల్ రాజు సమర్పణలో బొక్క వేణుగోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు రధాన్ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు.ఈ సినిమాను ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Advertisements
Advertisements