25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vani Jayaram: ప్రముఖ గాయని వాణీ జయరామ్‌కు ‘పద్మభూషణ్’. 19 భాషలు.. 20వేలకు పైగా పాటలు. మామూలు రికార్డు కాదు!

vani jayaram
Share

ప్రముఖ గాయని వాణీ జయరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ చలనచిత్రం ‘గుడ్డి’ సినిమాలో ‘బోలె రే పపీ హరా’ అనే సాంగ్ ద్వారా సినీ నేపథ్య గాయకురాలిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. తమిళురాలైన వాణీ జయరామ్ ఇప్పటివరకు 19 భాషల్లో పాటలు పాడింది. వేలల్లో భక్తి పాటలు, ఆల్బమ్స్ చేసిన వాణీ జయరామ్ ఇప్పటివరకు 20 వేలకుపైగా పాటలు పాడింది. ఇదొక సంచలన రికార్డు అనే చెప్పవచ్చు. వాణీ జయరామ్ జాతీయ చలనచిత్ర అవార్డులలో మూడు సార్లు, తెలుగు చిత్రాలకు రెండు సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును అందుకుంది. ప్రొఫెషన్‌ సింగర్‌గా ఇటీవలే 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా భారతదేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ను అందుకోనున్నారు.

vani jayaram
vani jayaram

శాస్త్రీయ సంగీతం మాట వచ్చేసరికి తెలుగు ప్రజలకు టక్కున గుర్తుకు వచ్చే పేర్లు సుశీల, జానకి. వీరిద్దరూ మంచి గాయనీమణులు. పైగా వీరిద్దరూ తెలుగు వారు కావడంతో ఒకింత అభిమానం ఉండటం సహజం. కానీ వీరి సరసన చేరడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న కూడా వాణీ జయరామ్ ఆ స్థాయిలో అర్హతను సంపాదించుకోకపోవడం విచారకరమనే చెప్పవచ్చు. సంగీత రంగంలో ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ అందజేసి సత్కరించనుంది. ఈ అవార్డుతో వాణీ జయరామ్ ఖ్యాతి మరింతగా పెరిగింది.

vani-jayaram
vani-jayaram

వాణీ జయరామ్ జీవిత విశేషాలు

వాణీ జయరామ్ తమిళనాడులోని వెల్లూరుకు చెందిన వారు. బాల మేధావి అయిన వాణీ జయరామ్ చిన్నతనంలోనే విశేష ప్రతిభను కనబర్చేవారు. తన ఎనిమిదొవ ఏట ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీతంపైన ఉన్న మక్కువతో కర్ణాటక సంగీతంను కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టీఆర్, బాలసుబ్రమణియన్, ఆర్ఎస్ మణి వద్ద అభ్యసించారు. హిందుస్థానీ సంగీతం మాత్రం ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ వద్ద నేర్చుకున్నారు. వివాహానంతరం భర్తతో ముంబైలో స్థిరపడ్డారు.

వాణీ జయరామ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తెలుగు సినిమా సంగీతంపై ఆమె ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. స్వాతి కిరణం సినిమాలో ఆమె పాడిన పాటలు ఎంతో శ్రావ్యంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఆమె ఏకంగా 11 పాటలను పాడారు. అలాగే విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం, స్వాతిముత్యం, స్వాతి కిరణం సినిమాల్లోని పాటలు అద్భుతంగా ఉంటాయని పలువురు ఇప్పటికీ చెబుతుంటారు.

వాణీ జయరామ్ టాప్ తెలుగు సాంగ్స్, సినిమాలు

ఘర్షణ (సినిమా) – ఒక బృందావనం

శంకరాభరణం (సినిమా) – యే తీరుగా నన్ను

శంకరాభరణం (సినిమా) – పలుకే బంగారమా

స్వాతి కిరణం (సినిమా) – కొండా కోనల్లో

స్వామి కిరణం (సినిమా) – ఓం గురు (శ్లోకం)

తిరుమల మహిమ (ఆల్బమ్) – శరణం శరణం

కబీర్ దాస్ (సినిమా) – ఏలుకోరా

అయ్యప్ప స్వామి మహత్యం (ఆల్బమ్) – కరిమల వాసుని

సంకీర్తన – దేవీ దుర్గా దేవి

దొంగకోళ్లు (సినిమా) – ఏమి వర్ణించను

ప్రేమ సందేశం (సినిమా)- మదిలోని ఆవేశం

అభిమానవంతులు (సినిమా) – ఎప్పటి వలె కాదురా నా స్వామీ

శ్రీమద్విరాటపర్వము – రమ్మని పిలిచిందో ఊర్వశి

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర – శృంగార రసరాజమౌళి


Share

Related posts

Ycp Leader Arrest: 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్..! ఆ వైసీపీ నేతను అరెస్టు చేసి తీసుకువెళ్లిన ఒడిశా సీఐడీ పోలీసులు..!!

somaraju sharma

క్యాచీ టైటిల్‌

Siva Prasad

అక్టోబర్ 1న ఏపి కేబినెట్ భేటీ

Special Bureau