మరో పాక్ డ్రోన్‌ను కూల్చేసిన భారత్

రాజస్థాన్, మార్చి 4 : భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఒక డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి.

రాజస్థాన్‌లోని బికనేర్‌ నల్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సోమవారం ఉదయం 11.30 గంటలకు ‘సుఖోయి 30ఎంకేఐ’ యుద్ధ విమానం కూల్చేసినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. భారత వైమానిక దళ రాడార్ల ద్వారా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించి, వెంటనే ప్రతిస్పందించారు.

యుద్ధ విమాన శకలాలు పాకిస్తాన్‌ సరిహద్దు వైపున ఉన్న ఇసుక దిబ్బలపై పడిపోయినట్లుగా తెలుస్తోంది.

గత వారం గుజరాత్‌ కచ్ ప్రాంతంలో పాక్ డ్రోన్‌ను భారత్ కూల్చి వేసింది. పాక్ సరిహద్దులకు అతి దగ్గరగా ఉండే నలియా ఎయిర్ బేస్ సమీపంలో ఇది చోటు చేసుకున్నది.