పాక్ యుద్ధోన్మాదం- రష్యానుంచి ట్యాంకులు

Share

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కూడా పాకిస్థాన్ ఆయుధ సామగ్రిని సముపార్జించుకుని భారత సరిహద్దులలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్న విధానాన్నే అనుసరిస్తున్నది. ఒక వైపు పాక్ లో పాలన కొనసాగేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులలో సమమతమౌతూ రుణం కోసం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన ఆ దేశాధినేత ఇమ్రాన్ ఖాన్ కు నిరాశే మిగిలింది. ఇక ఐఎమ్ఎఫ్ నుంచి భారీ రుణం కోసం ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ కు అమెరికా అభ్యంతరాల కారణంగా రుణం మంజూరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అదే సమయంలో అమెరికా సహాయంలో కోత ఆ దేశాన్ని మరింత సంక్షోభంలో ముంచేస్తున్నది. ఇక చైనా నుంచి తీసుకున్న రుణం పాకిస్థాన్ ను దివాళా ముంగిటకు నెట్టివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నిటీకీ కారణం ఆ దేశం తన భూభాగాన్ని ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చేయడమేనని అమెరికా విస్పష్టంగా చెబుతున్నది. ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం ఆపితే తప్ప పాకిస్థాన్ కు ఏ విధంగానూ సహాయం అందించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే దేశ పరిస్థితి ఇంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ భారత్ సరిహద్దులలో ఉద్రిక్తతలు చల్లారకుండా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉంది. అందులో భాగంగానే భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంట తన సైనిక శక్తిని బలోపేతం చేసే లక్ష్యంతో రష్యా నుంచి 600 ట్యాంకుల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యుద్ధ ట్యాంకులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్ధ్యం కలిగినవని చెబుతున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: నోయల్ రీ ఎంట్రీ..??

sekhar

Rape :రేప్ అనగానే ఎమోషన్ కాకండి : పదండి ఘట్కేసర్ వెళదాం!

Comrade CHE

చంద్రబాబు గూటికి వైసీపీ పార్టీ నేత..??

sekhar

Leave a Comment