జాతీయం న్యూస్

పడవ ద్వారా భారత్ కు భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా.. 6గురు పాకిస్థానీయులు అరెస్టు .. డ్రగ్స్ విలువ ఎంత అంటే..?

Share

చేపలు పట్టే పడవ ద్వారా పాకిస్థాన్ నుండి భారత్ కు భారీగా మాదక ద్రవ్యాలను (డ్రగ్స్) ను తరలిస్తుండగా కోస్ట్ గార్డు అధికారులు, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళ సిబ్బంది పట్టుకున్నారు. అరేబియా మహాసముద్రంలో గుజరాత్ లోని జాభౌ తీరానికి 33 నాటికల్ మైళ్ల దూరంలో భారత జలాల్లో ప్రవేశించిన పాక్ పడవను గుర్తించి కోస్ట్ గార్డు సిబ్బంది పట్టుకున్నారు. ఈ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్థాన్ పౌరులను అదుపులోకి తీసుకుని వారి నుండి 40 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.200 కోట్ల విలువ ఉంటుందని అంచనా.

Pakistani Boat Carrying Drugs

 

ఈ డ్రగ్స్ ను వారు గుజరాత్ తీరానికి చేర్చి అక్కడ నుండి రోడ్డు మార్గంలో పంజాబ్ తరలించాలని పథక రచన చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. బోట్ ను సీజ్ చేసిన అధికారులు… నిందితులను విచారణ నిమిత్తం జాభౌకు తరలించారు.

షర్మిల పై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ పోచారంకు ఎమ్మెల్యేల ఫిర్యాదు .. ఫిర్యాదులపై షర్మిల స్పందన ఇది    


Share

Related posts

God Photo: మీ ఇంటి ప్రధాన ద్వారం మీద బయటపక్కకు కనబడేలా దేవుడి ఫోటో పెట్టుకున్నారా?? వెంటనే ఇలా చేయండి!!

siddhu

ఆ ఎమ్మెల్యే కు మాట్లాడటం చేతకాదా ? ప్రతిసారి వివాదమే

Special Bureau

దివంగత సీఎం వైఎస్ఆర్ కు నేతల ఘన నివాళులు.. ఇడుపులపాయలో ఘాట్ వద్ద సీఎం జగన్, విజయమ్మ, షర్మిల

somaraju sharma