Jersey: ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ తర్వాత ఇండియన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం సౌత్ సినిమాల హవా కొనసాగుతుందని అంతకుముందు బాలీవుడ్ సినిమాలకు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు బ్రహ్మరథం పట్టేవారు. ముఖ్యంగా పాకిస్థాన్ దేశంలో బాలీవుడ్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే… అక్కడ బాక్సాఫీస్ వద్ద వ్యాపారం మామూలుగా ఉండదు. దేశ పరంగా వివాదాలు ఉన్నాగాని ఎంటర్టైన్మెంట్ రంగం విషయంలో… పాకిస్తాన్ ఎక్కువగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటది.
ఈ క్రమంలో ఇటీవల ఇండియన్ ఫిలిం ఒకటి అక్కడ పాకిస్తాన్ దేశం లో రిలీజ్ కావడం జరిగింది. ఆ సినిమా మరేదో కాదు జెర్సీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. ఇదే సినిమాని బాలీవుడ్ లోకి షాహిద్ కపూర్ ఇటీవల రీమేక్ చేయడం జరిగింది.
తెలుగులో తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే షాహిద్ కపూర్ నటించాడు. కాగ ఇటీవల ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడం జరిగింది. ఇండియాలో పాటు పాకిస్థాన్ దేశంలో కూడా హిందీ “జెర్సీ” విడుదలయింది. ఈ సందర్భంగా క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో పాకిస్తాన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రికెటర్ మహమ్మద్ అమీర్.. హిందీ “జెర్సీ” సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో అందమైన ఆదర్శ కరమైన సినిమా బ్రదర్ అంటూ షాహిద్ కపూర్ నీ ప్రశంసిస్తూ.. గొప్ప పనితనం సినిమాలో కనబరిచారు అని సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…