Acharya : ‘ఆచార్య’ సినిమా విషయంలో దర్శక,నిర్మాతలకి ఒక క్లారిటీ రావడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవి ‘ఆచార్య’. చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా మొట్ట మొదటిసారి మెగాస్టార్ – చరణ్ ఫుల్ లెన్త్ రోల్స్ లో కలిసి నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా కోసం మెగా అభిమానుల తో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవబోతోంది. కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. వాస్తవంగా అయితే ‘ఆచార్య’ మే నేలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల విడుదల వాయిదా వేశారు.
Acharya : ఆచార్యకి మంచి రిలీజ్ డేట్ దొరకడం లేదని టాక్ వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు ఆచార్య రిలీజ్ డేట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దసరాకి వస్తుందా లేక దీపావళికి వస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ దసరా సందర్భంగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తుండటంతో దానికి దగ్గరగా ఆచార్య రిలీజ్ చేయడం అసాధ్యం అంటున్నారు. ఆల్రెడీ సంక్రాతి బరిలో పవన్ – రానా మూవీ, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యాం దిగుతున్నాయి. ఈ మేరకు అఫీషియల్ గా కూడా మేకర్స్ ప్రకటించారు. దాంతో ఆచార్యకి మంచి రిలీజ్ డేట్ దొరకడం లేదని టాక్ వినిపిస్తోంది.