ట్రెండింగ్ న్యూస్ సినిమా

రెడ్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిన రామ్ ..?

Share

రెడ్ సినిమాతో ఎనర్జిటిక్ హీరో రామ్ పాన్ ఇండియన్ స్టార్ అయినట్టేనా ..? అంటే అవునన్న మాట ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోంది. అందుకు కారణం ram రెడ్ సినిమా అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ చేస్తుండటమే. సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ తన లేటెస్ట్ సినిమా red తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ మాస్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ram నుంచి వచ్చిన red సినిమా మీద ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోగా ఆ అంచనాలను రామ్ అందుకున్నాడు.

red సినిమా రిలీజ్ రోజు మాత్రమే కాదు ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ఏడు రోజులకుగాను red సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వరకు వరకు వసూళ్లు సాధించిందని తెలుస్తోంది. red సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5 కోట్లు. అయితే ఇప్పటి వరకు 3.5 కోట్ల లాభాలను సాధించింది. ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి రెడ్ సినిమాకు లాంగ్ రన్ లో వసూళ్ళు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు red సినిమాను మలయాళంలో కూడా విడుదలచేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా ram red సినిమా దాదాపు 100 కి పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

మన ram కెరీర్లో ఇదే అతి పెద్ద మలయాళ రిలీజ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక red సినిమా అక్కడ కూడ హిట్ సాధిస్తే ram కు మలయాళంలో కూడ మంచి మార్కెట్ ఏర్పడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ లెక్కన చూస్తే ram red సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా పాపులారిటీ సాధించినట్టే అంటున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా మాళవిక శర్మ, నివేథా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక రామ్ నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా క్రాక్ తో ఫాం లోకి వచ్చిన గోపీచంద్ మలినేని పేరు కూడా వినిపిస్తోంది.


Share

Related posts

రానా పెళ్లి ముహూర్తం ఖరారు..! ఎప్పుడు…. ఎక్కడంటే….

arun kanna

Bigg Boss: గత ఐదు సీజన్ ల కంటెస్టెంట్ లతో కంపేర్ చేస్తే.. షణ్ముక్ రికార్డ్..!!

sekhar

Sharmila : షర్మిల వ్యూహాలతో కుదేలవుతున్న ఆ పార్టీ..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar