NewsOrbit
న్యూస్

కమలం వైపు కదులుతున్న పనబాక దంపతులు? కానీ ఒకే ఒక్క కండిషన్ !!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా టిడిపి వికెట్ మరొకటి పడిపోయే సూచనలు గోచరిస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి నుండి పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిపోయారని సమాచారం.

ఫక్తు కాంగ్రెస్ వాది అయిన పనబాక లక్ష్మి పలు పర్యాయాలు నెల్లూరు,బాపట్ల ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ కి డైరెక్ట్ యాక్సిస్ ఉన్న నాయకురాలిగా పనబాక లక్ష్మి పేరు తెచ్చుకున్నారు. అయితే 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరూ కాంగ్రెస్ ను వీడి పోగా పనబాక లక్ష్మి కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆమె భర్త ,దక్షిణ మధ్య రైల్వే రిటైర్డ్ పీఆర్వో కృష్ణయ్య కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి ఎస్సీ లోక్సభ నియోజకవర్గం నుండి పనబాక లక్ష్మిని,’గూడూరు అసెంబ్లీ నుండి ఆమె భర్త కృష్ణయ్యను టిడిపి నిలిపింది. అయితే జగన్ ప్రభంజనం లో ఈ ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల అనంతరం పనబాక దంపతులు సైలెంట్గా ఉండిపోయారు.

అయినప్పటికీ తాజాగా టిడిపి రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులను ప్రకటించినప్పుడు కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉన్న తనకు అవకాశం వస్తుందని పనబాక లక్ష్మి ఎదురుచూశారు. అయితే చంద్రబాబు..పార్టీలో క్రియాశీలంగా లేని పనబాక దంపతులను పక్కన పెట్టారు. ఇది పనబాక లక్ష్మికి అసంతృప్తి కలిగించింది. ఇదే సమయంలో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణించడంతో త్వరలో ఉప ఎన్నిక కూడా జరగనున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు తనకు తిరుపతి టికెట్ ఇచ్చే అవకాశం లేదని పనబాక లక్ష్మి గ్రహించారు. దీంతో ఆమె బీజేపీ వైపు దృష్టి సారించారని సమాచారం. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తన సహచరురాలైన దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నందున ఆమె ద్వారా కమలనాథుల క్యాంపులో అడుగుపెట్టాలని పనబాక లక్ష్మి పావులు కదుపుతున్నారట.

తిరుపతి లోక్సభ సీటు ఇస్తే వెంటనే పార్టీలోకి వస్తానని ఆమె బీజేపీ రాష్ట్ర నాయకులకి సమాచారం కూడా పంపారట. పనబాక లక్ష్మి బీజేపీ లోకి వెళ్ళడానికి ఒక ఇంకో కారణం కూడా ఏమిటంటే తిరుపతి లో ఆ పార్టీకి గట్టి పునాది ఉంది. 1999లో తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి విజయం సాధించడం జరిగింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జయరామ్ కేవలం 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గెలుపోటములు పక్కన పెడితే బీజేపీ కేంద్రంలో అత్యంత బలంగా ఉన్నందున తనకు ఆ పార్టీలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, టిడిపి పని అయిపోయినందున ఇక అందులో ఉండటం అవసరమని పనబాక లక్ష్మి ఒక నిర్ణయానికి వచ్చారని, ఇవాళో రేపో ఆమె బాంబు పేలుస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే టిడిపి మళ్లీ తిరుపతి కోసం కొత్త అభ్యర్థిని వెతుక్కోక తప్పదు .లేకపోతే పాతకాపు వర్ల రామయ్య ని తిరుపతి దారి పట్టిస్తారు.

 

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!