న్యూస్

Panjab Congress: కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర సీనియర్ నేత గుడ్ బై..

Panjab Congress ex pcc Chief quits party
Share

Panjab Congress: ఓ పక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ ముఖ్యనేతలు రాజస్థాన్ లో మేధో మధన సదస్సు నిర్వహిస్తున్న వేళ ఓ సీనియర్ నేత పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ మాజీ అధ్యక్షుడు సునీల్ జకార్ పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ షాక్ నుండి కోలుకోకముందే అదే రాష్ట్రానికి పార్టీ మాజీ అధ్యక్షుడు జకార్ పార్టీని వీడారు.

Panjab Congress ex pcc Chief quits party
Panjab Congress ex pcc Chief quits party

శనివారం ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న జకార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని సునీల్ జాకార్ పై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయనే పార్టీకి రాజీనామా చేశారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడుగా పని చేసిన జకార్ గతంలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా గుర్తింపు పొందారు.

కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో కూర్చుని రాష్ట్రంలోని పార్టీని నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ మంచి వక్తి అని కితాబు ఇచ్చిన జకార్..పార్టీ సిద్ధాంతాలు వదలవద్దని సోనియా గాంధీకి సూచించారు. సునీల్ జకార్ మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపిగా గెలిచారు.


Share

Related posts

BREAKING – Maa Elections : మంచు విష్ణు కి షాక్ .. ‘ఆ’ వీడియోలు బయట పెట్టిన ప్రకాష్ రాజ్ …!

Ram

ఓటింగ్ పట్ల హైదరాబాదీల నిరాసక్తి

Siva Prasad

విజయవాడ వైసీపీలో మళ్లీ ఫ్లెక్సీల రగడ ..పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar