పూరి జగన్నాధ్ కంటే స్పీడ్ గా పరశురాం.. సర్కారు వారి పాట ని ఎన్ని రోజుల్లో రిలీజ్ చేస్తున్నాడో తెలుసా ..?

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో సినిమాలు తీస్తాడని ఒకే ఒక్క్ అ పూరి జగన్నాధ్ కి మాత్రమే పేరుంది. వారం రోజుల్లో కథ రాసి వారం రోజుల్లో కంప్లీట్ స్క్రిప్ట్ రెడి చేసేస్తాడు. ఇక హీరో ఎవరైనా పూరి సినిమా తీసేది మాత్రం 70-80 రోజుల్లోనే. దాదాపు సినిమా మొదలు పెడితే 4 – 5 నెలల్లో రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. అలాంటి సినిమలు ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలే ఉదాహరణ. అయితే ఇప్పుడు పూరి మాదిరిగా ఇండస్ట్రీలో మరో దర్శకుడు అతి తక్కువ సమయంలో సినిమా కంప్లీట్ చేసేందుకు పక్కా ప్లాన్ చేసుకున్నాడు.

Happy Birthday Mahesh Babu: 'Sarkaru Vaari Paata' motion poster is out and it's exciting

అతనే పరశురాం. ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో అద్భుతమైన కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం నటించబోతున్నసినిమా ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో 27 వ సినిమాగా రూపొందనుండగా గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ..14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సర్కారు వారి పాట పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా తయారవబోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సెకండ్ లీడ్ లో కనిపించనుదని సమాచారం. థమన్ ఇప్పటికే ఈ సినిమాకి అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నాడట. ఇక దర్శకుడు ఈ సినిమాకోసం ప్రస్తుతం అమెరికాలో లొకేషన్ ఫైనల్ చేస్తున్నట్టు తాజా సమాచారం.

కాగా నవంబర్ నుంచి చిత్రీకరణ మొదలు పెట్టి జనవరి ఆఖరు వరకు దాదాపు 70 శాతం టాకీ పార్ట్ కంప్లీట్ చేయడానికి షెడ్యూల్ సిద్దం చేశాడట. ఎటువంటి పరిస్థితుల్లో సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా రెడీ చేయాలని టీం ప్లాన్ చేస్తుందని తాజా సమాచారం.